జాతీయ నాయకుల్లారా… ద‌మ్ముంటే చార్మినార్ రండంటున్న అస‌ద్

Read Time: 0 minutes

మైనారిటీ వ‌ర్గాల‌కు ప్ర‌తీకగా మారి, దేశ‌వ్యాప్తంగా వారిని ఓన్ చేసుకోవ‌టంలో ముందుండే ఎంఐఎం నేత అస‌ద్ మ‌రోసారి అదేత‌ర‌హా దాడి మొద‌లుపెట్టారు. జాతీయ నాయ‌కులంతా… మైనారిటీ ఓట‌ర్ల ప‌ట్ల మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని, ద‌మ్ముంటే… నా స‌వాలుకు సిద్ధమ‌యి, ఎవ‌రేంటో నిరూపించుకోవాల‌ని స‌వాల్ విసిరారు.

ఒవైపు తెలంగాణ‌లో రాహుల్ ఎన్నిక‌ల టూర్ కొన‌సాగుతూండ‌గా, మైనారిటీ వ‌ర్గాల ఓట్లే ల‌క్ష్యంగా కాంగ్రెస్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న ద‌శ‌లో, అస‌ద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇద్ద‌రు జాతీయ‌నాయ‌కుల‌కు స‌వాల్ విసిరారు. బీజేపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా, కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ ను హైద‌రాబాద్ లో పోటీకి ఆహ్వ‌నించారు. మైనారిటీవ‌ర్గాల కోసం ప‌నిచేస్తున్నామ‌నే నాయకుల్లారా… మూస్లీం సంప్ర‌దాయానికి ప్ర‌తీక అయిన చార్మీనార్, హైద‌రాబాద్ అని, ఇక్క‌డ హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స్థానం నుండి ద‌మ్ముంటే పోటీ చేయాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. అయితే, రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ప్ర‌చారం చేస్తుంద‌ని, కాంగ్రెస్ పట్ల గ‌తంలో ఎంతో సానుకూలంగా ఉన్న మైనారిటీల‌ను ఎలాగైనా… కాంగ్రెస్ వైపుకు వెళ్ల‌కుండా అస‌ద్ రంగంలోకి దిగుతార‌ని అంతా అనుకున్నారు. అనుకున్న‌ట్లే… అస‌ద్ ట్విట్ట‌ర్ వేధిక‌గా స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌కు శ్రీ‌కారం చుట్టారు.

చూడాలి… మరీ, అస‌ద్ ట్వీట్ కు రిప్లై వ‌స్తుందో, నేత‌లు లైట్ తీసుకుంటారో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*