జ‌గ‌న్ పార్టీకీ తాకిన కేసీఆర్ సెంటిమెంట్… జ‌గ‌న్ కూ క‌లిసొస్తుందా…?

Read Time: 1 minutes

రాజ‌కీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నుతాయో, అందుకు ఏమాత్రం తగ్గ‌కుండా సెంటిమెంట్  ను, శాస్త్రాల‌ను న‌మ్ముతారు. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు కేసీఆర్ లాగా… న్యూమ‌రాలజీని, మూడ‌న‌మ్మ‌కాల‌ను, దేవుళ్ల‌ను ఎక్కువ‌గా ఫాలోఅవుతుంటారు. ఇప్పుడు అదే కోవ‌లోకి వెళ్ల‌బోతుంది జ‌గ‌న్ పార్టీ.

ఏపీలో మంచి క్రేజ్ ఉన్నా, చివ‌రి నిమిషంలో అధికారానికి దూర‌మైన వైసిపికి… ఈసారి ఎన్నిక‌లు చావోరేవో అన్న‌ట్లు ఉండ‌బోతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందేన‌ని కృత‌నిశ్చ‌యంతో ఉంది వైసీపీ. జ‌గ‌న్ క్రైస్త‌వ మ‌తానికి చెందిన వాడు.  అయితే, ఆపార్టీలోని కీల‌క నేత ఒక‌రు… జ‌గ‌న్ ను సీఎం చేయాలంటే శ‌త‌చండీ యాగం చేయాల‌ని ఎవ‌రో వేద‌పండితులు చేసిన సూచ‌న మేర‌కు ఆయ‌న యాగాన్ని నిర్వ‌హిస్తున్నారు.

వైసీపీ కీల‌క‌నేత‌ల్లో ఒక‌రైన ఎమ్మెల్యే కొడాలి నాని ఈ యాగాన్ని చేయిస్తున్నారు. ఈయాగం త‌మ‌నేత‌కు యోగ‌భాగ్యాల‌ను తెచ్చిపెడుతుంద‌ని ఆయ‌న‌, వారి నాయ‌క‌త్వం కూడా బ‌లంగా న‌మ్ముతోంది. ఉద్యమ నేత‌గా కేసీఆర్ కూడా అనేక యాగాలు చేశారు. తెలంగాణ వ‌చ్చి సీఎం అయితే చండీయాగం చేస్తాన‌ని మొక్కుకున్నా… అని కేసీఆరే స్వ‌యంగా కూడా చెప్పారు. యాగం చేశారు.  అయితే, ఈ యాగానికి వైసీపీ నేత‌లే కాకుండా, టీడీపీలోని ఒక‌రిద్ద‌రు సీనీయ‌ర్ నాయ‌కులు కూడా అటెండ్ అవ‌టం… ఇప్పుడు ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ను రాజేస్తోంది. గ‌తంలో కొడాలి నానితో ఉన్న వ్య‌క్తిగ‌త సంబంధాల‌తోనే ఆయన యాగానికి వెళ్లామ‌ని స‌ద‌రు నాయ‌కులు చెబుతున్నా, టీడీపీ మాత్రం సీరీయస్ గా తీసుకుంటుంది. అయితే, స‌ద‌రు నాయ‌కులు కేసీఆర్ యాగానికి చంద్ర‌బాబు వెళ్లలేదా అని ప్ర‌శ్నిస్తుండ‌టం…. టీడీపీని ఇరుకున పెడుతోంది.

ఉప్పూ-నిప్పూలా ఉండే వైసీపీ-టీడీపీలు ఏ చిన్న అవ‌కాశం దొరికినా రాజ‌కీయంగానే వాడుకుంటున్న నేప‌థ్యంలో, ఈ కేసీఆర్ సెంటిమెంట్ జ‌గ‌న్ కు ఎంత‌మేర‌కు అచ్చివ‌స్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*