టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు కేసీఆర్ టానిక్, వ‌ర్క‌వుట‌య్యేనా…?

Read Time: 0 minutes

ప‌థ‌కాలు ప్రారంబించాం, ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం… మీరు అదె చెప్పండి, ప్ర‌జ‌లు మ‌న‌వైపే ఉన్నారు, మీరు అదైర్య‌ప‌డ‌వ‌ద్దు ఇలా కొంత దైర్యం చెప్తూ, అబ్య‌ర్థుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ అబ్య‌ర్థుల పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో… ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 105మంది అబ్య‌ర్థులు, ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు గులాబీ బాస్.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆద్వ‌ర్యంలో గ్రూపు క‌ట్టిన టీడీపీ, సిపిఐ, టీజెఎస్ ను త‌క్కువ అంచ‌నా వేయొద్దు. ఏ మాత్రం అల‌ర్ట్ గా లేక‌పోయిన మీ గెలుపు క‌ష్ట‌మే అవుతుంది. ప్ర‌జ‌ల్లో మ‌న ప‌ట్ల సానుకూల‌త ఉంది. ద‌సరాకు ముందే నేను స‌ర్వే చేయించా… మీరంద‌రు గెల‌వ‌బోతున్నారంటూ అబ్య‌ర్థుల‌తో ముచ్చ‌టించారు గులాబీ బాస్. ప‌థ‌కాల‌ను మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టంతో పాటు, కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు ధీటుగా టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి, మీకు పార్టీ అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

105 మంది అబ్య‌ర్థుల‌కు… ప్ర‌భుత్వ ప‌రంగా, ఈ నాలుగున్న‌రేండ్ల‌లో అందిన ప్ర‌బుత్వ ప‌థ‌కాల లాభాల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారిగా జాబితా త‌యారు చేయించారు. ఏ పథ‌కంతో ఏ గ్రామంలో ఎవ‌రు ల‌బ్ధిపొందారు అన్న‌దానిపై పూర్తి వివ‌రాల‌తో ఓ రిపోర్టు త‌యారు చేసి, అబ్య‌ర్థుల‌కు వారివారి నియోజ‌క‌వ‌ర్గాల డేటాను అంద‌జేశారు. వీరిని సంప్ర‌దించండి, వారంతా మ‌న‌కు అనుకూలంగా ఓటు వేస్తారు, ప్ర‌తి గ్రామంలో దాదాపు మెజారిటీ మంది మ‌న ప్ర‌బుత్వ ప‌థ‌కాల‌ను పొందారు అంటూ… నేత‌ల‌కు దైర్యం చెప్పి పంపించారు కేసీఆర్.

చూడాలి మ‌రీ… రేప‌టి నుండి కేసీఆర్ ఇచ్చిన టానిక్ ఎంత‌మేర‌కు ప‌నిచేస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*