టీఆర్ఎస్ కంచుకోట‌ల్లోనే బ‌లంగా ఎదురుగాలి… టెన్ష‌న్ లో కేసీఆర్

Read Time: 0 minutes

ఉద్య‌మ సమ‌యంలోనూ, ఉప ఎన్నిక‌ల్లోనూ… టీఆరెఎస్ ను, స్వ‌రాష్ట్ర ఆకాంక్ష‌ను స‌జీవంగా ఉంచేందుకు అండ‌గా నిలిచిన ఆ జిల్లాలే ఇప్పుడు టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి. కేసీఆర్ మాటే వేదంగా… ఒక్క పిలుపు ఇస్తే చాలు, ప్ర‌బుత్వాలు ఎవైనా, నేత‌లెవ‌రైనా… కేసీఆర్  కు ప‌ట్టం క‌ట్టారు. ఎన్ని ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా, ఒక్క ప‌ని చేయ‌కున్నా… తెలంగాణ వాదం కోసం కేసీఆర్ వెంట న‌డిచిన ఆ జిల్లాలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటెనే మండిప‌డుతున్నాయి. రాష్ట్రం కోసం కొట్లాట‌లో వెంట ఉన్నాం… ఇప్పుడు రాష్ట్రం వ‌చ్చింది, మీరు చెప్పిన హ‌మీలు ఎమ‌య్యాయి అంటు నిల‌దీస్తున్నారు.

ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ జిల్లాలైన‌… క‌రీంన‌గ‌ర్, మెద‌క్, అదిలాబాద్, నిజామాబాద్ ల‌లో టీఆర్ఎస్ కు వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మిక్స్ డ్ ఓపినీయ‌న్ ఉండ‌గా, ఖ‌మ్మంలో కూడా ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు తెలుస్తోంది. పైకి వంద‌సీట్లు గ్యారంటీ అని కేసీఆర్ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా…  ప్ర‌చారానికి వెళ్లిన అబ్య‌ర్థుల మ‌న‌సుకు ఎంత నెగెటివ్ ఉందో స్ప‌ష్టంగా తెలుసు.

అందుకే కేసీఆర్… తెలంగాణ ప్ర‌భుత్వ ల‌బ్ధిదారుల లిస్టు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా వ‌డ‌పోసి మ‌రీ ఇచ్చారంటే అర్థం చేసుకోవ‌చ్చు. వార్ వ‌న్ సైడ్ ఉంటే… కేసీఆర్ ఒక్క మాట చాలు, గెలిచి రావ‌డానికి. కానీ ఆ ప‌రిస్థితి లేనందునే… పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. జ‌య‌ప‌జ‌యాల‌ను ప్ర‌స్తావిస్తూనే… ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ వ‌ద్దంటూ కేసీఆర్ టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌ను హెచ్చ‌రింటం… వాస్త‌విక ప‌రిస్థితిని అర్థంచేసుకోవ‌చ్చు.

అయితే.. ఈ ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో కూట‌మి ఎంత‌బ‌ల‌ప‌డితే, టీఆర్ఎస్ అధికారానికి అంతంత దూరంగా వెళ్తుంద‌ని అర్థం చేసుకోవాటంటున్నారు రాజ‌కీయ పండితులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*