టెన్ష‌న్ లో టీఆర్ఎస్, గ్రేట‌ర్ ఓట‌రు ఎవ‌రి వైపు….?

Read Time: 1 minutes

ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న వేళ‌… రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఇన్నాళ్లుగా కేసీఆర్-కేటీఆర్ లు చంద్ర‌బాబు ఆయ‌న టీం ను తెగ తిట్టిపోశారు. కానీ ఆ వాఖ్య‌ల‌కు ఇత‌ర తెలంగాణ జిల్లాల్లో ఎన్ని ఓట్లు ప‌డుతాయో తెలియ‌దు కానీ, గ్రేట‌ర్ ప‌రిధిలోని టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌ను టెన్ష‌న్ కు గురిచేస్తున్నాయి. స‌

చంద్ర‌బాబును ఎంత తిడితే మాకు అంత మైన‌స్, మ‌హ‌కూట‌మికి బ‌లం పెరుగుతుంది… ముఖ్యంగా గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న సీమాంద్ర సెటిల‌ర్లు ఎవ‌రూ త‌మ‌కు ఓటు వేసే ప‌రిస్థితి లేదంటూ, కేటీఆర్ వ‌ద్ద‌కు గ్రేట‌ర్ అబ్య‌ర్థులు వెళ్లారు. దీంతో ఆయా ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ తరుపున కేటీఆర్ స‌భ‌ల‌కు హ‌జ‌ర‌వుతున్నారు. మాకు అండ‌గా ఉండండి, మేము మిమ్మ‌ల్ని బాగానే చూసుకుంటాం…. ఈ నాలుగున్న‌రేండ్లలో  ఎలా ఉందో ఇక మీద అలాగే ఉంటుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా, ఈ విష‌యం కేసీఆర్ చెప్ప‌గ‌ల‌డా, మాకు అండ‌గా ఉండే చంద్ర‌బాబును తిడుతూ… మాకు న్యాయం చేయ‌గ‌ల‌రా అన్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయ‌ట‌. దీంతో గ్రేట‌ర్ లో ఉన్న ప‌రిస్థితి అర్థం చేసుకొని మ‌రిన్ని స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోతే, ప‌రాభావం త‌ప్ప‌ద‌ని అంచాన‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకే నేను కేసీఆర్ కొడుకుగా హ‌మీ ఇస్తున్నా అంటూ కేటీఆర్ దైర్యం చెప్పే ప్ర‌యత్నం చేస్తున్నారు.

మ‌రీ, కేటీఆర్ స‌ల‌హా… గ్రేట‌ర్ లో వ‌స్తున్న నెగిటివ్ దృష్ట్యా, కేసీఆర్ త‌న వ్యూహాన్ని మార్చుతారా, చంద్ర‌బాబును తిట్ట‌కుండా ఓట్లు అడుగుతారా…. కూట‌మిని ఎమ‌ని విమ‌ర్శిస్తారు… ఇవ‌న్నీ తెలియాటంటే, వ‌చ్చే ఖ‌మ్మం స‌భ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*