ట్విట్ట‌ర్ వేధిక‌గా… ఉత్త‌మ్, కేటీఆర్ డైరెక్ట్ ఫైట్.

Read Time: 0 minutes

ఎప్పుడూ ట్విట్ట‌ర్ లో దూకుడుగా ఉండే… ఉత్తమ్, కేటీఆర్ లు మ‌రోసారి డైరెక్ట్ ఫైట్ దిగారు. ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు పోలీసుల ప‌నితీరుపై నేరుగా మాట‌కు మాట స‌మాధానం చెప్ప‌టంతో… అంతా ఏం జ‌రుగుతుందోనిని ఆస‌క్తి గా ఫాలో అయ్యారు.

కేటీఆర్ మామ‌, ఇత‌ర చుట్టాలు… పోలీస్ బాసులుగా ఉండి, ఆప్ర‌జాస్వామికంగా ప్ర‌తిపక్ష నేత‌లే టార్గెట్ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. టాస్కోఫోర్స్ టీమ్స్ ను పెట్టి వెంబ‌డిస్తున్నారు అంటూ ఉత్త‌మ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌… దీనిపై చర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. ఎన్నిక‌ల క‌మీష‌న్ దీనిపై సీరీయ‌స్ యాక‌క్ష‌న్ తీసుకోవాల‌ని కోరారు. దీనిపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఉత్త‌మ్ వాఖ్య‌లు ఖండిస్తున్నాన‌న్నారు. ఒకే సామాజిక వ‌ర్గం అయినంత మాత్రాన ఇలాంటి వాఖ్య‌లు స‌రికాద‌ని, దేశంలోనే మ‌న పోలీసుల‌కు మంచిపేరుంద‌ని గుర్తు చేశారు. దేశానికే తెలంగాణ పోలీస్ రోల్ మాడ‌ల్ గా ఉన్నారంటూ… పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వెన‌కేసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.రాష్ట్రం లో శాంతిబ‌ద్ర‌త‌ల‌ను కాపాడుతున్నార‌న్నారు.

అయితే, ఎన్నిక‌ల సమ‌యంలో కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌లే టార్గెట్ గా, మ‌ప్టీ పోలీసుల‌ను మోహ‌రించటం… ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్ర‌తిప‌క్ష నేత‌ల వాహ‌నాల‌ను మాత్ర‌మే ఆపి, సోదాలు నిర్వ‌హించ‌టం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం అవుతున్నాయి. దీనిపై ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకోకుంటే, అవ‌స‌ర‌మ‌యితే కోర్టుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

అయితే, ఈ వార్ ఆఫ్ వ‌ర్డ్స్ పై పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు చేస్తూ… సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ ట్విట్ట‌ర్ పోస్టింగ్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*