డీల్లీలో కేసీఆర్ కు కంటివెలుగు.

Read Time: 1 minutes

ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శిగా, తాను ప్ర‌వేశ‌పెట్టే ప‌థ‌కాలు… త‌న‌తో పాటు అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండేలా చూడాల్సిన నైతిక‌త ప్ర‌భుత్వ పెద్ద‌గా సీఎంది. ఇందులో ఎలాంటి అనుమానాల‌కు తావు లేదు. గ‌వ‌ర్న‌ర్ లా ఏ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనో త‌న ఆరోగ్య స‌మ‌స్య చూపించుకొని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై న‌మ్మ‌కం పెరిగేలా… వ్య‌వ‌హ‌రించాల్సిన సీఎం, ఇక్క‌డ త‌న ఆద్వ‌ర్యంలో న‌డుస్తున్న  స‌ర్కారి ద‌వ‌ఖాన‌ల‌పై న‌మ్మ‌కంలేక డిల్లీ వెళ్తే….

కేసీఆర్ కు కంటి, పంటి ప‌రీక్ష‌ల కోసం డిల్లీ వెళ్లారు. కానీ రాష్ట్రంలో రెండున్న‌ర కోట్ల మందికి బంగారంలా కంటివెలుగు అందుతుంది అని చెప్పిన సీఎంయే డిల్లీకి వెళ్తే…. ఇక్క‌డ కంటి వెలుగు ప‌థ‌కం ఫెయిల్ అనే క‌దా అర్థం…. అంటే అవున‌నే చెప్పొచ్చు.  ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న్న ఉద్దేశంతో హ‌డావిడిగా కంటివెలుగ ప‌థ‌కం పెట్టి, అద్దాలు-శ‌స్త్ర‌చికిత్సల పేరుతో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం తప్పా మ‌రేమీ కాదు.దుర్వినియోగం కాలేదు, ప‌థ‌కం స‌క్సెస్ అనేవారు మ‌రీ సీఎం ఎందుకు ఇక్క‌డ చేయించుకోలేదు అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

అయితే… ఇది పైకి చెప్పే సాకుగా మాత్ర‌మే క‌న‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో, కంటి చికిత్స పేరుతో కేసీఆర్ డిల్లీ వెళ్లారు. అక్క‌డ మోడీ అనుచ‌ర‌గణంతో మంత‌నాలు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు తెలంగాణ‌లో ఫండింగ్ చేస్తున్నార‌ని విమ‌ర్శించిన కేసీఆర్, చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయాలంటే… ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం, వారి కంపెనీల‌పై కేంద్ర సంస్థ‌ల‌తో మ‌రింత ఒత్తిడి తేవాల‌ని కోరే అవ‌కాశం క‌న‌ప‌డుతోందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఓట‌మి భ‌యంతోనే, కేసీఆర్ డిల్లీకి ప‌రుగెత్తార‌ని… మ‌ళ్లీ గెల‌వాల‌న్న కేసీఆర్  క‌ల నిజం కాద‌ని… కేసీఆర్ తిరిగి వ‌చ్చాక‌, ఎన్నిక‌ల‌య్యాక కొత్త స‌ర్కార్ ను కంటివెలుగు చికిత్స తో చూడాల‌ని చ‌మ‌త్క‌రిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*