తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌

Read Time: 0 minutes

ఎన్నిక‌ల వేల… పోలీసుల హ‌డావిడి, నిఘా భారీగా పెరుగుతుంది. సొంత వాహానాల్లో వెళ్లినా, సొంత డ‌బ్బు ర‌వాణా చేస్తున్నా… చెక్ పోస్ట‌ల ద‌గ్గ‌ర ఆపిన‌ప్పుడు స‌మాధానాలు, ఆదారాలు చూపాల్సిందే. లేదంటే ఆ సోమ్ము సీజ్ చేస్తారు. ఒక్క డ‌బ్బె కాదు, మ‌ద్యం విష‌యంలోనూ ఇలాంటి సంద‌ర్భాలే క‌నిపిస్తాయి. అయితే… ఇంద‌కు సంబందించి తెలంగాణ మ‌ద్యం శాఖ అధికారులు మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు.

శుభ‌కార్యానికో, లేదా ఇత‌ర వాటికో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తుండ‌టం స‌హ‌జం. ఈరోజుల్లో మ‌ద్యం షాపుల్లో దాదాపుగా ఎవ‌రూ ర‌శీదు, బిల్లులు ఇవ్వ‌రు. కానీ ఇవ్వ‌క‌పోతే… ఎన్నిక‌ల అధికారులు ప‌ట్టుకుంటారు. దీనికి ఇక చెక్ ప‌డ‌నుంది. ఈస‌మ‌స్య‌ను తీర్చ‌డానికి ఓ మ‌ద్యేమార్గాన్ని క‌నిపెట్టారు. ప్ర‌తి వ్య‌క్తి… త‌న వ్య‌క్తిగ‌త అవ‌సరాల దృష్ట్యా…6 ఫుల్ బాటిల్లు, 12 బీర్లు తీసుక‌వెళ్లే స‌దుపాయాన్ని క‌ల్పించారు. ఇంత‌వ‌ర‌కు మ‌ద్యాన్ని ఎవ‌రు తీసుకెళ్లినా… అబ్యంత‌రం చెప్ప‌రు. ఇంత‌కు మించి తీసుకెల్లినా, స‌ర‌ఫ‌రా చేసినా మాత్రం… ఖ‌చ్చితంగా ఆధారాల‌తో స‌హా ఎందుకు, ఎక్క‌డికి అన్న‌ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఈ స‌మస్య‌ల‌పై ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తో చ‌ర్చించిన ఎక్సైజ్ అధికారులు… త్వ‌ర‌లో రాబోయే కేంద్ర ఎన్నిక‌ల సంఘం బృందంతో కూడా స‌మావేశం కాబోతున్నారు. ఎన్నిక‌ల వేళ మ‌ద్యం పంపిణీ ఎలా అరిక‌ట్టాలి, ప్ర‌లోభాలు ఎలా నివారించాలి అన్న‌దానిపై వారు చ‌ర్చించ‌బోతుండ‌గా, ఇప్ప‌టికే రాష్ట్రం న‌లుమూల‌ల అంటే ఇత‌ర రాష్ట్రాల‌తో మేజ‌ర్ క‌నెక్టివిటీ ఉన్న 6 చోట్ల మ‌ద్యం అక్ర‌మ రవాణాపై ఆంక్ష‌లు విధించారు. ద‌స‌రా త‌ర్వాత ఆ ఆంక్ష‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*