తెలంగాణ ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరం.. దూరం

Read Time: 0 minutes

తెలంగాణ‌లో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు… జ‌న‌సేనాని దూరంగా ఉండ‌బోతున్నారు. ముఖ్యంగా గ్రేట‌ర్ వ‌ర‌కు అయినా ప్ర‌భావం చూపే స్థాయిలో ప‌వ‌న్ ఉన్నారు. ప‌వ‌న్ కు అభిమాన‌లు, ఫెయిర్ ఎల‌క్ష‌న్ స్లోగ‌న్స్ జ‌న‌సేన‌కు కొంత ఓటు బ్యాంకు తెచ్చిపెట్టేలా ఉన్నా… ప‌వ‌న్ మాత్రం పోటీపై పెద్ద‌గా ఆస‌క్తి చూపిన‌ట్లు క‌న‌ప‌డ‌టం లేదు. ప‌వ‌ర్ అభిమానుల్లో ఆంద్రా ప్రాంతం నుండి హైద‌రాబాద్ లో సెటిల్ అయిన వారికి ఓటు హ‌క్కు కూడా ఇక్కడే ఉంది. సో, జ‌న‌సేన పార్టీపై పోటీకి చాలామంది నేత‌లు ఆస‌క్తిగా ఉన్నారు.

గ‌తంలో గ్రేట‌ర్ వ‌ర‌కు లోక్ స‌త్తా పార్టీ చాలా ప్ర‌భావితం చేసింది. ఈసారి జ‌న‌సేన పోటీలో ఉంటే… అదే ప్ర‌భావం చూపే అవ‌కాశం ఖ‌చ్చితంగా ఉంది. కానీ ఓట్ల శాతం లో మెరుగ్గా క‌నిపించినా, గెలిచే స్థానాలు మాత్రం పూర్తిగా లేవ‌ని తెలుస్తోంది. అందుకే ప‌వ‌న్, తెలంగాణ ఎన్నిక‌ల‌పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌టం లేదు. పైగా… ఇక్క‌డ పోటీ చేసి, ఓట‌మి పాల‌యితే ఈ ప్ర‌భావం… ఖ‌చ్చితంగా వ‌చ్చే ఆంద్రా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం ఉంటుంది. అది పార్టీకి మంచిది కాద‌న్న‌ది, ప‌వ‌న్ ముఖ్చ అనుచ‌రుల అభిప్రాయం. ఇక్క‌డ క‌నీసం రెండు నుండి 5 స్థానాలు గెలిచే అవ‌కాశం ఉంటే మంచిది కానీ, ఒక్క సీటు కూడా గెలిచే అవ‌కాశం లేకుంటే మాత్రం… ప‌వ‌న్ ప‌ని అయిపోయింద‌ని, ఇత‌ర నేత‌ల గెలుపు ను మారుస్తుంది కానీ, ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను కాదంటూ… జ‌గ‌న్, చంద్ర‌బాబు ఆడుకుంటారు. అందుకే ప‌వ‌న్ దూరం, దూరంగానే ఉంటున్నారు.

అయితే, కాంగ్రెస్ కు ఎక్కువ‌గా గ్రేట‌ర్ ప‌రిధిలో విజ‌య‌వ‌కాశాలుంటే మాత్రం… ప‌వ‌న్ ను పోటీ చేయించాల‌న్న‌ది కేసీఆర్ కోరిక అని తెలుస్తోంది. ప‌వ‌న్ ను పోటీ చేయించాలా… లేదా అన్న‌దానిపై ఇప్ప‌టికైతే టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైతే మాత్రం ఖ‌చ్చితంగా… పోటీచేయించే ఒత్తిడి అయితే ఉండ‌నుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*