తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.

Read Time: 0 minutes

తెలంగాణ ఎన్నిక‌ల‌ బ‌రిలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏంటీ అనే క‌దా మీ డౌట్… ఇది స‌హ‌జంగానే తెలంగాణ వారికే కాదు, ఆంద్రావారికి ఆశ్చ‌ర్యం క‌లిగించే వార్తే అయినా, స్వ‌యంగా ల‌గ‌డ‌పాటే… చెప్తున్న మాట కూడా.

ఆంద్రాలో భావోద్వేగ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి… అక్క‌డ పోటీ చేసే ఉద్దేశం లేదు, 2014 నుండి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా…. ఉండాల‌నే అనుకుంటున్నా అంటూ రాజ‌గోపాల్ మీడియా ముందు ఓపెన్ అయిపోయారు. అయితే… నేను నా ప్రాంతంప‌ట్ల అప్పుడు చూపిన క‌మిటెమెంట్ వ‌ల్ల‌…  ఇప్పుడు న‌న్ను కొంత‌మంది తెలంగాణ‌లో పోటీచేయాల‌ని అడుగుతున్నారు, మొద‌క్ జిల్లాల్లో నాకు పోటీచేయాల‌ని ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ రాజ‌కీయాల ప‌ట్ల వైరాగ్యం ప్ర‌ద‌ర్శిస్తూనే… తెలంగాణ రాజకీయాల్లో ఆస‌క్తి చూపిస్తుండ‌టం, అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

త‌న టీంతో ప‌క్కాగా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషించ‌టంలో ముందుండే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్, అతి త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో కూడా స‌ర్వే చేయించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న టీంకు ఆ ప‌ని అప్ప‌గించార‌ని స‌మాచారం.

అయితే… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా… వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే… ఏ పార్టీ త‌రుపున పోటీచేసేది మాత్రం బ‌య‌ట‌పెట్టలేదు ల‌గ‌డ‌పాటి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*