దిక్కుమాలిన మూడ‌న‌మ్మ‌కాల కేసీఆర్, మండిప‌డుతున్న జ‌నం

Read Time: 0 minutes

న‌మ్మ‌కాలు ఉండాలే కానీ మూడ‌న‌మ్మ‌కాలు ఉండ‌కూడ‌దు. ఉన్నా… నీ ఇంట్లో ఉండాలే కానీ తెలంగాణ స‌మాజం మీద ఎలా రుద్దుతారు. ఇదీ ఓ స‌గ‌టు తెలంగాణ వ్య‌క్తి కేసీఆర్ కు వేస్తున్న సూటి ప్ర‌శ్న‌. ఇన్నాల్లు… మూడ‌న‌మ్మ‌కాలతో ఉన్నా, త‌న సొంత వ్య‌వ‌హ‌రాల వ‌రకే ప‌రిమిత‌మైన కేసీఆర్, ఇప్పుడు ఏకంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు, ప్ర‌జ‌ల‌తో ముడిప‌డిన అంశాల‌కు లింక్ చేస్తున్నారు.

తాజాగా కేసీఆర్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను ప్ర‌క‌టిస్తూ… నిరుద్యోగుల‌కు 3016రూపాయాలు, విక‌లాంగుల‌కు 3016 రూపాయాలు, ఆస‌రా పెన్ష‌న్లు 2016 ఇస్తానంటూ… టీఆర్ఎస్ మ్యానిఫెస్టో రీలీజ్ చేశారు. ఇది చూసిన జ‌నం అంతా… ఈ 16 సంఖ్య ఎందుకు అని ఇస్తే… ఇంకో 500 రూపాయ‌లు ఎక్కువ ఇచ్చినోడు కాదు, లేక‌పోతే… స‌మానం చేసి… 3వేలు, 2వేలు ఇచ్చినోడు కాదు… అంటూ మండిప‌డుతున్నారు. అయితే… ఈ ప‌థ‌కాల్లో 6 అనే సంఖ్య ఉంటే టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు క‌లిసివ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే కేసీఆర్ ఈ 16, 6 అంకె పెట్టార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలంటున్నాయి.

కానీ ఎవ‌రో చెప్పిన మూడ న‌మ్మ‌కాలు, ప్ర‌జ‌ల పాల‌న‌, సంక్షేమంతో ముడిప‌డిన అంశాల‌కు పెట్ట‌ట‌మేమిట‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. రాను రాను కేసీఆర్ కు ఈ మూడ‌న‌మ్మ‌కాల పిచ్చి పెరిగిపోతుంద‌ని, మ‌ళ్లీ అధికారం ఇస్తే… ఇంకేం చేస్తారోనంటూ ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ స్వంత లాభం కోస‌మే… ప‌రిపాల‌న అన్న‌ట్లు ప్ర‌జల‌కు ఇచ్చే ప‌థ‌కాలు ఉన్నాయ‌ని, కేసీఆర్ రాజు త‌ర‌హాలో తెలంగాణ‌ను పాలించాల‌ని చూస్తున్నార‌న‌టానికి ఇది ప్ర‌త్య‌క్ష ఉద‌హార‌ణ అంటూ విమ‌ర్శిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*