దేశీబూతు షో… స్వ‌ప్న‌సుంద‌రి, త్వ‌ర‌లో తెలుగులో…..

Read Time: 1 minutes

దేశంలోనే పేరుమోసిన టీవీ నెట్ వ‌ర్క్ లో ఒక‌టైన స‌న్ నెట్ వ‌ర్క్ ప్ర‌భ ఇప్పుడు త‌గ్గుతూ వ‌స్తోంది. అటు త‌మిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఏ ప్రోగ్రాం క్లిక్ కాక నిరాశ‌లో ఉంది. ఓవైపు జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి షోతో ఈటీవీ, బిగ్ బాస్ షోల‌తో స్టార్ టీవీ రీజీన‌ల్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుండ‌టంతో, ఏం చేయాలో పాలుపోవ‌టం లేదు స‌న్ గ్రూపుకు. దీంతో దానికి విరుగుడుగా… ఓ షో రెడీ చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళంలో ఇప్ప‌టికే ఈ ప్ర‌యోగాన్ని అమ‌లు చేస్తుండ‌గా, త్వ‌ర‌లో తెలుగులోకి తీసుక‌రాబోతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు కామెడీ పేరుతో జ‌రుగుతున్న బూతును మాత్ర‌మే చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు, ఇప్పుడు జెమినీటీవీలో మోడ‌లింగ్ పేరుతో అంగంగా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌బోతోంది. స్టార్ మా, ఈటీవీకి చెక్ పెడుతూ ఈ ప్రోగ్రాం ను డిజైన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికాలో బాగా ఫేమ‌స్ అయిన‌… AMERICAN’S NEXT TOP MODEL  షో త‌ర‌హాలో, స్వ‌ప్న‌సుంద‌రి పేరుతో… మాడ‌లింగ్ పై మోజు ఉండి, అందం-చందం ఉన్న అమ్మాయిల‌తో ఈ షో ఉంటుంది. అందాలు అర‌బోసి, గ‌తంలో మాడ‌లింగ్ నుండి సినిమాకు ప‌రిచ‌య‌యిన వారు గెస్టులుగా ఉండ‌బోతున్నారు.  మోడ‌లింగ్ పై ఆస‌క్తి ఉండి, మోడ‌లింగ్ చేస్తున్న అమ్మాయిల ఆరబోత ఉండ‌నుంది. ఈ షోకు రెష్మీని యాంకర్ గా అనుకుంటున్న‌ట్లు కూడా టాక్ విన‌ప‌డుతున్నా…. ఇంకా అఫిషీయ‌ల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

కింగ్ ఫిష‌ర్ మోడ‌ల్స్ తో క్యాలెండ‌ర్ అంటే కుర్ర‌కారు ఎగ‌బ‌డేవారు. అలాగే ఈ షో ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ… తెరకెక్క‌బోతున్న షో తెలుగులో ఎంత‌వ‌ర‌కు క్లిక్ అయితుందో చూడాలి. అయితే, ఇప్ప‌టికే స్వ‌ప్న‌సుంద‌రి పేరుతో త‌మిళ్ న‌డుస్తున్న షో పై అనేక వివాదాలు చుట్టుముట్ట‌డం గ‌మ‌నార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*