నన్ను మోడీ సంతృప్తి ప‌ర్చ‌లేక‌పోతున్నాడంటున్న ట్రంప్

Read Time: 0 minutes

పెద్ద‌న్న దేశానికి అధిప‌తి అయినా, కొంచెం వెట‌కారంగా మాట్లాడ‌టంలో నా త‌ర్వాతే ఎవ‌రైనా అని మ‌రోసారి నిరూపించుకున్నాడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే… ఆయ‌న చేసిన ఈ వాఖ్య‌లు వాణిజ్య ఒప్పందానికి సంబందించిన‌వి. కేవ‌లం త‌న‌ను సంతృప్తిప‌ర్చ‌డానికే భారత్‌,  అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్‌పై మండిపడ్డారు.

సుంకాల పెంపునకు సంబంధించి ట్రంప్‌ భారత్‌ను విమర్శించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ట్రంప్  మీడియాతో మాట్లాడుతూ జపాన్, యూరోపియన్‌ యూనియన్, చైనా, భారత్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’గా పేర్కొన్న ట్రంప్‌, ప్రీమీయం బైకుల్లో మేటీ అయిన‌…  హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లపై పెంచిన సుంకాలను ప్రస్తావించారు. సుంకాలు తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా, అవి ఇంకా అధికంగానే ఉన్నాయని గుర్తుచేశారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*