నాలుగు టీంలు, 45 రోజులు… కాంగ్రెస్ ప్ర‌చార వ్యూహాలు.

Read Time: 0 minutes

సీట్ల‌పంపిణీపై క్లారిటీ వ‌స్తున్న నేప‌థ్యంలో… ఇక ప్ర‌చారం పై దృష్టిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎక్క‌డెక్క‌డ పోటీచేయాల‌నే దానిపై కూడా మ‌రో మూడు, నాలుగు రోజుల్లో ఫైన‌ల్ కానున్న నేప‌థ్యంలో, ప్ర‌చారం ముమ్మురం చేయాల‌ని కాంగ్రెస్ డిసైడైంది. సీనీయ‌ర్ నేత‌ల‌ను… రంగంలోకి దించ‌బోతున్నారు.

ఓవైపు సోనియాగాంధీతో  ఉత్త‌ర తెలంగాణ‌లో  రెండు, మూడు స‌భ‌లు, రాహుల్ తో ద‌క్షిణ తెలంగాణ‌లో మూడు, నాలుగు రోజుల ప్ర‌చార షెడ్యూల్ ను స్థానిక కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఏఐసీసీ ఫైన‌ల్ చేసింది. ఇక రాష్ట్ర నేత‌ల‌తో ఇప్ప‌టికే ప్ర‌చార క‌మిటీలు వేసినా…. కీల‌క నేత‌ల‌తో మొత్తం నాలుగు కీల‌క క‌మిటీల‌ను ఫైన‌ల్ చేసింది పీసీసీ.

పీసీసీ అద్య‌క్షుడు ఉత్త‌మ్ నేతృత్వంలో ఒక క‌మిటీ, జానారెడ్డి నాయ‌క‌త్వంలో ఓ క‌మిటీ, రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఒక‌టి, భ‌ట్టి నాయ‌క‌త్వంలో మ‌రోక‌మిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 45 రోజుల్లో ఈ ప్ర‌చారాన్ని ముమ్మురం చేయాల‌ని, మొత్తం 31 జిల్లాల్లో ప్రచారాన్ని హోరేత్తించాల‌ని కాంగ్రెస్ డిసైడ్ అయింది. నాలుగు మూల‌ల నుండి నాలుగు క‌మిటీలు ప్ర‌చారం చేసేలా… ప్రచార షెడ్యూల్ ను ఖ‌రారు చేయ‌బోతున్నారు. కాంగ్రెస్ నేత‌లంతా సైనికుల్లా ప‌నిచేయాల‌ని, కాంగ్రెస్ కోసం క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌ను పార్టీ గుర్తించి, అధికారం రాగానే స‌ముచిత స్థానం క‌ల్పిస్తుంద‌ని ఉత్త‌మ్, ఖుంతియాలు అభ‌యం ఇచ్చారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*