న‌వంబ‌ర్ 1న విడుద‌ల‌

Read Time: 1 minutes

రాష్ట్రంలో ఓవైపు చేరిక‌లు, మ‌రోవైపు ప్ర‌చారంతో దూసుక‌పోతున్న కాంగ్రెస్ పార్టీ, అబ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు రంగం సిద్ధం చేసింది. ఇప్ప‌టికే ఆశావాహులంద‌రితో ఆ పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం వ‌రుస‌గా స‌మావేశ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే చాలా సీట్ల‌పై స్ప‌ష్ట‌త ఉంద‌ని, పొత్తుల విష‌యంపై కూడా ఈ లోపే తేల్చ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

90కి పైగా సీట్ల‌లో పోటీచేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన పార్టీ, ఇప్ప‌టికే ముఖ్య‌నేత‌లతో స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. ముందుగా తొలివిడుత జాబితా అయిన విడుద‌ల చేయాల‌ని నేత‌లు సూచించ‌టంతో, మార్గం సుగుమ‌మం అయింది. ఇక‌… అదే రోజు పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కూడా ప్ర‌క‌టించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్ని హ‌మీల‌ను పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించ‌గా, రాష్ట్రంలోని ప్ర‌జ‌లు-ప్ర‌జాసంఘాల‌తో అనేక చ‌ర్చ‌లు జ‌రిపిన ఎన్నిక‌ల మ్యానిఫెస్టో క‌మిటీ ఓ తుది నివేధిక‌ను రూపోందించింది. ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలి… అనేదానితో పాటు ఏ  జిల్లాకు ఏం చేయబోతున్నామో కూడా చెప్పే అవ‌కాశం ఉంద‌ని మ్యానిఫెస్టో క‌మిటీ అంటోంది. టీఆర్ఎస్ హ‌మీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, కాంగ్రెస్ ఇవ్వ‌బోయే ఎన్నిక‌ల హ‌మీలు జ‌నంలోకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.

ఇప్ప‌టికే ఏర్పాటైన 4 ప్ర‌చార టీంలు… ఈ ఎన్నిక‌ల హ‌మీల‌ను, టీఆర్ఎస్ ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌బోతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*