పాత‌బ‌స్తీలో మ‌ళ్లీ అల్ల‌ర్లు, ఎన్నిక‌ల సంఘానికి ప‌క్కా ఆధారాలు.

Read Time: 0 minutes

హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ళ్లీ మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్ల‌తో వేడేక్క‌బోతుందా….? ఎన్నిక‌ల వేడి రాజుకున్న త‌రుణంలో… ఈ అల్ల‌ర్లు రాజ‌కీయ ప్రేరేపిత కుట్ర‌గా తెర‌పైకి వ‌స్తోందా…?   కొన్ని పార్టీల‌కు మేలు చేసే ఉద్దేశంతో వేసిన ప‌క్కా స్కెచ్ పై ఈసీకి స‌మాచారం అందిందా అంటే అవున‌నే అంటున్నాయి ఈసీ వ‌ర్గాలు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేందుకు కొన్ని శ‌క్తులు మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్ల‌కు రెడీ అయ్యాయంటూ ఇంట‌లిజెన్స్ కూడా స‌మాచారం సేక‌రించింది.

ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నదని నిఘావర్గాలు హెచ్చరించడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణకు తగినన్ని బలగాలను మోహరించాలని ఈసీ స్పష్టంచేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్‌లో మూడు కంపెనీల కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీసు బలగాలను కూడా మోహరించాలని అధికారులు భావిస్తున్నారు. పాతబస్తీలో సాధ్యమైనంత ఎక్కువగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని నిఘావర్గాలు సూచించడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్, సైబరాబాద్, రాచ‌కొండ క‌మీష‌రేట్ల సీపీల‌తో ఈసీ భ‌ద్ర‌త‌పై స‌మీక్షించ‌గా, సీపీలు త‌మ త‌మ ప‌రిధిలో అధికారుల‌ను అలెర్ట్ చేశారు.

ఇక‌, పాతబ‌స్తీలో ఇత‌ర పార్టీలు బ‌లం పుంజుకుంటున్న కార‌ణంగానే… ఈ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారా…అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ ఒక‌టి,రెండు పార్టీల‌కే మెజారిటీ ప్ర‌జ‌లు త‌మ‌పార్టీలుగా భావిస్తు వస్తుండ‌గా, క్ర‌మేపీ… ఇత‌ర పార్టీలు కూడా అక్క‌డి గ‌ల్లీల‌కు చేరువ‌వుతుండ‌టంతోనే, సెంటిమెంటు ర‌గిల్చే కుట్ర ఇదంతా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్ర‌శాంతంగా ఉన్న న‌గ‌రంలో…. ఎలాంటి హింస‌, అల్ల‌ర్లు లేకుండా ఎంత‌వ‌ర‌కు మ‌న పోలీస్ క‌ట్ట‌డి చేస్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*