ప్రిన్స్ కు అవ‌మానం… ఫ్యాన్స్ ఫుల్ ఫైర్.

Read Time: 0 minutes

మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ తో ఫుల్ బిజిగా ఉన్న మ‌హేష్ బాబుకు ఘోర అవ‌మానం ఎదురైంది. బ‌హుషా తాను క‌ల‌లో కూడా అనుకోని ఉండ‌డేమో.  అబ్బాయిలే కాదు… అమ్మాయిల్లోనూ మ‌హేష్ బాబు అంటే సూపర్ క్రేజ్. తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ తో పోటీ ప‌డే హీరోల్లో ఈ ఇమేజ్ ఒక్క మ‌హేష్ కే సొంతం.  అలాంటి మ‌హేష్ తో డిన్న‌ర్ అంటే ఎగిరి గంతేస్తారు. ఆ ఆఫ‌ర్ కోసం ఎమైనా చేస్తారు. కానీ అక్క‌డ మాత్రం… ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌. ఎక్క‌డా అనుకుంటున్నారా… మీరే చ‌ద‌వండి.

ఈమ‌ద్య అమెరికాలో ఫండ్ రైజింగ్ పేరిట మూవీ అర్టిస్ట్ అసోసియేష‌న్ మా లో జరిగిన అల్ల‌రి  అంద‌రికీ తెలిసిందే. అయితే… మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ కోసం మ‌హేష్ అమెరికాలో ఉన్నారు. ప‌నిలో ప‌నిగా ఫండ్ రైజింగ్ కోసం అంటూ అక్క‌డ ఓ స్టార్ హోట‌ల్ లో డిన్న‌ర్ విత్ మ‌హేష్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందుకోసం 4వేల డాల‌ర్లు టికెట్ ధ‌ర‌గా కేటాయించారు. మ‌హేష్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రోగ్రాంకు అనుకున్నంత మేర రెస్పాన్స్ రాలేదట‌. టికెట్ రేటును  ఎంత త‌గ్గించినా… కొద్దిమంది కూడా ఇంట్రస్ట్ చూప‌క‌పోవ‌టంతో, ఆ ఈవెంట్ ను కాన్స‌ల్ చేశార‌ట నిర్వాహ‌కులు.

దీంతో… మ‌హేష్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అన‌వ‌స‌రంగా ప‌రువు తీశార‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌టంతో… మ‌హేష్ అభిమానులు అదే స్థాయిలో ఫైర్ అవుతుండ‌గా, మ‌హ‌ర్షి సినిమా స‌హ త్వ‌ర‌లో మ‌హేష్ తో సినిమా చేయ‌బోయే నిర్మాత‌లు అబ్రాడ్ లో మ‌హేష్ మ‌రీ ఇంత వీకా, ఇలా అయితే, అబ్రాడ్ క‌లెక్ష‌న్స్ పై పెద్ద‌గా ఆశ‌పెట్టుకోవ‌ద్దు అంటూ పెదవి విరుస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*