ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో వెన‌క్కి త‌గ్గిన ఎంపీ క‌విత‌

Read Time: 0 minutes

కవిత తెలంగాణ‌కేమైనా ఆడబిడ్డానా… కేసీఆర్ ఇంటికా ?, ఏ అధికారంతో… బ‌తుక‌మ్మ ఆడుతుంది, బతుక‌మ్మ కోసం  ప్ర‌భుత్వం ఇచ్చిన పైస‌లేమైతున్న‌ట్లు…? ఇలా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోని  క‌విత ఎట్ట‌కేల‌కు వెన‌క్కి త‌గ్గింది. ఎన్నిక‌ల యేడాదిలో మ‌రోసారి ఇలాంటిర‌క‌మైన ఆరోప‌ణ‌లే వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టం, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

మొన్న‌టి వ‌ర‌కు కూడా… ఈసారి మ‌రింత ఘ‌నంగా జాగృతి బ‌తుక‌మ్మ ఏర్పాట్లు చేస్తుంద‌ని ప్ర‌క‌టించినా, చివ‌రి నిమిషంలో ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌బుత్వం నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా, తెలంగాణ సాంస్కృతిక వైభ‌వాన్ని చాటేలా బ‌తుక‌మ్మ సంబ‌రాలు చేశాం, కానీ ఈ నాలుగేళ్లు ఎన్నో వ్య‌తిరేక వాఖ్య‌లు చేయ‌టం వ‌ల్ల బాధ‌తో ఈ యేడు వేడుక‌లు చేయ‌టం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ, ప్ర‌తియేడు… నేను కూడా ఉద్య‌మంలో వ్య‌క్తిగా బ‌తుక‌మ్మ నిర్వ‌హిస్తా అని ముందుకు వ‌చ్చిన అరుణోద‌య‌నాట్య‌మండ‌లి క‌ళాకారిణి విమ‌ల‌క్క‌ను ప్ర‌బుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింద‌ని, మ‌రీ నాడు విమ‌ల‌క్క‌కు ఎందుకు అనుమ‌తివ్వ‌లేదో చెప్పాల‌ని విప‌క్షాలు, ప‌లు మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాగృతి క‌న్నా ముందు, జాగృతి త‌ర్వాత కూడా తెలంగాణ ఆడబిడ్డ‌లు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో… బ‌తుక‌మ్మ ఆడిపాడుతార‌ని, సంబురాలు నిర్వ‌హిస్తారంటున్నాయి మ‌హిళా సంఘాలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*