ప‌ర్వాలేదు గురూ… హ‌లో గురు ప్రేమ కోస‌మే రివ్యూ Rating 2/5

Read Time: 0 minutes

పాత క‌థ‌కు కొత్త‌ధ‌నం అద్ది, పాత క‌థలాగే   మ‌ళ్లీ మార్కేట్లోకి వ‌స్తున్న సినిమాలు ఎన్నో. అందులో హ‌లో గురు ప్రేమ కోస‌మే ఒక‌టే. రామ్ మార్క్ కామెడీ లేక‌, పాత క‌థ‌తో… మెప్పించే ప్ర‌య‌త్నం చేసినా, క‌థా బ‌లం క‌న్నా క‌థ‌నం బ‌లంగా ఉంద‌ని చెప్పొచ్చు. ఇద్ద‌రు అమ్మాయిలు, ఓ మామ క‌థ‌తో రామ్ సినిమాను నెట్టుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌స్ట్ హ‌ఫ్ క‌న్నా, సెకండ్ ఆఫ్ రోటీన్ గా సాగింది. సినిమా  సాగుతున్న‌ప్పుడు ఉండే ట్విస్టులు కూడా లేక క్లైమాక్స్ సాదాసీదాగా చ‌ప్ప‌గా ముగుస్తుంది. నెక్ట్స్ ఎం జ‌రుగుతుందో ఆడియ‌న్స్ హిజీగా చెప్పుకోవ‌వ‌చ్చు.

హీరోయిన్ అనుప‌మ క్యారెక్ట‌ర్ అయితే పెట్టాలి కాబ‌ట్టి పెట్టారు. ఆమె కోసం వ‌చ్చే యూత్ ప్రేక్షాకులకు ఈ సినిమా అస్స‌లు న‌చ్చ‌దు. ఇక ఫెడ్ అవుట్ ద‌శ‌లో ఉన్న మ‌రో హీరోయిన్ ప్ర‌ణీత గ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేసేందుకు క‌ష్ట‌ప‌డుతుంద‌ని చెప్పుకోవ‌చ్చు. కానీ త‌న క్యారెక్ట‌ర్ అలా మ‌ద్య‌లో ముగుస్తుంద‌ని ఎవ‌రూ అస్స‌లు ఊహించ‌రు. ఇక మామ పాత్ర‌లో హీరో రామ్ తో న‌టించిన ప్ర‌కాష్ రాజ్ ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌కు తాను న్యాయం చేశాడ‌ని చెప్పుకోవ‌చ్చు. రోమాంటిక్ కామెడీగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేసిన నిర్మాత‌ దిల్ రాజు, ద‌ర్శ‌కుడు త్రినాథ్ లు…  రోమాంటిక్ డ్రామా గా చూపించారు అని చెప్పుకోవ‌చ్చు. రామ్ లాంటి హీరోకు పూర్తిగా సెట్ అయ్యే సినిమా అయితే కాదు, కానీ సినిమా ఓసారి చూడ‌వ‌చ్చ‌న్న‌ది థియేట‌ర్ ఆడియ‌న్స్ ఫీలింగ్. పండుగ సంద‌ర్భంగా… స‌ర‌ద‌గా ఓ సినిమాకు వెళ్ధామ‌న‌కుంటున్న వారు ఓసారి చూసిరావ‌చ్చు కానీ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత కు పోటీ అయితే కాదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*