ప‌వ‌న్ ను మ‌ర్చిపోలేనంటున్న… మాజీ భార్య‌.

Read Time: 1 minutes

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ర్చిపోలేనంటొంది ఆయ‌న మాజీ భార్య‌. ఎప్పుడూ సోష‌ల్ సైట్ల‌లో త‌న అభిప్రాయాన్ని షేర్ చేసుకునే ప‌వ‌న్ రెండో భార్య రేణు దేశాయ్… ఈ మ‌ద్య కాస్త సైలెంట్ గా ఉంది. ప‌వ‌న్ మ‌రో పెళ్లిచేసుకొని బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తే త‌ప్పు లేనిది, తాను చేసుకుంటే త‌ప్పేంటి అంటూ… ఆ మ‌ద్య ప‌వ‌న్ అభిమానులపై ఫైర్ అయి, సోష‌ల్ సైట్స్ కు దూరం అయింది.

అయితే… ఇటీవ‌ల మ‌ళ్లీ, సోష‌ల్ సైట్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఆమె, ప‌వన్ క‌ళ్యాణ్ తో గ‌డిపిన క్ష‌ణాల‌ను మ‌ర్చిపోవ‌టం నావ‌ల్ల కావ‌టం లేదు, ఆయ‌న మ‌ర్చిపోలేని వ్య‌క్తి అంటూ… పొస్టులు పెట్టింది. దీంతో నెటిజ‌న్లంతా…ఆమె ఏం రాసిందో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నార‌ట‌.

పవన్ కల్యాణ్  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించి, నాలుక క‌ర్చుకున్న సినిమా జానీ.  ఆ సినిమాతోనే రేణుదేశాయ్- ప‌వ‌న్ ల ప్రేమాయ‌ణం మొద‌లైంది. ఆనాటి సినిమా విశేషాల‌ను నేమ‌రేసుకుంటూ…. రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు తనను హీరోయిన్ గా ఎంపిక చేశారని.. కానీ మొదట్లో తాను ఒప్పుకోలేదని.. చివరికి పవన్ తనను ఒప్పించారని రేణు తెలిపారు.

‘‘జానీ సినిమాకు నేను మొదట ప్రొడక్షన్ డిజైనర్‌ నే. అయితే షూటింగ్‌కు రెండు వారాల ముందు నన్ను ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మొదట నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు నా ఇంట్రస్ట్   మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, టెక్నికల్ విషయాలపైనే ఉంది. కానీ చివరికి పవన్  నన్ను ఒప్పించారు. దాదాపు  ఏడు నెలల పాటు రోజుకు 17 గంటలు పనిచేశా. ఓ ప్రక్క ప్రొడక్షన్ డిజైనర్‌గా పనులు చూసుకుని, మేకప్ రూమ్‌కి వెళ్లి హీరోయిన్‌గా  రెడీ అవ్వాల్సి వచ్చేది. జీవితం ఏదైనా సవాలు విసిరితే.. స్వీకరించ గలగాలి. అప్పుడే మనం పర్శనల్ గానూ, ప్రొఫిషినల్ గానూ ఎంతో నేర్చుకుంటాం’’ అని రేణు ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఎందుకు…అని కొందరంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని మరిచిపోవటం, ఆ అనుభూతులను వదిలేయటం సాధ్యమయ్యే పనేనా చెప్పండి. అంటూ ముగించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*