బాబాయ్ అడుగుజాడ‌ల్లో అబ్బాయ్….

Read Time: 0 minutes

శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో తిత్లి తుఫాన్ మిగిల్చిన న‌ష్టం నుండి ఇప్పుడ‌ప్పుడే అక్క‌డి ప్ర‌జ‌లు తేలుకునేలా క‌న‌ప‌డ‌టం లేదు. సిక్కోలు ప్ర‌జ‌లు తిత్లి భీభాత్సానికి ఇంకా వ‌ణుకుతూనే ఉన్నారు. కొన్ని గ్రామాలైతే… నామ‌రూపాలు లేకుండా పోయాయి. ఓవైపు ప్ర‌బుత్వం నుండి స‌హాయ‌క చ‌ర్యలు అందుతున్న అవి ఏమూల స‌రిపోవ‌టం లేదు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తు ఉన్నారు. అయితే, ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ అద్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిక్కోలు ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తూ, అక్క‌డి ప‌రిస్థితుల‌కు చ‌లించిపోయారు. దీంతో వారికి స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

సిక్కోలు గ్రామాల్లో ఎదో ఒ గ్రామాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ద‌త్త‌త తీసుకోవాలంటూ… త‌న అన్న‌య్య చిరంజీవి కుమారుడు సీనీస్టార్ చ‌ర‌ణ్ కు సూచించారు. దీనిపై రియాక్ట్ అయిన చ‌ర‌ణ్… బాబాయ్ స‌ల‌హ మేర‌కు తాను ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకొని, ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే తాను త‌న టీంతో చ‌ర్చించాన‌ని, బాబాయ్ స‌ల‌హా మేర‌కు అతిత్వ‌ర‌లోనే ఎదో ఓ గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని, అక్క‌డ ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూసుకుంటాన‌ని ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు.

బాబాయ్ సూచ‌న‌కు చ‌ర‌ణ్ పాజిటివ్ గా రెస్పాండ్ కావ‌టంతో… జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సంతోషంలో మునిగిపోయారు. అవ‌స‌ర‌మ‌యితే రానున్న రోజుల్లో ప‌వ‌న్ పార్టీ కోసం చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం చేసేందుకు కూడా రెడీ గా ఉంటాడ‌ని, ప‌వ‌న్ కోరితే చ‌ర‌ణ్ ఎట్టిప‌రిస్థితుల్లో కాద‌న‌డంటున్నారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*