బీజేపి టాప్ 3కి అంటుకుంటున్న అవినీతి మ‌ర‌క‌లు.

Read Time: 1 minutes

ఇన్నాళ్లు… త‌మ పాల‌నలో అవినీతి లేదంటూ ఊద‌ర‌గొట్టిన బీజేపినేత‌ల‌కు నిజంగా ఇది షాకింగ్ వార్తే. బీజేపి స‌ర్కార్ లో ప్ర‌స్తుతం టాప్-3లో ఉన్న మోడీ, అమిత్ షా, అరుణ్ జైట్లీకి నేరుగా అవినీతి మ‌ర‌క‌లు అంటుకుంటున్నాయి. లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌, సెమీఫైన‌ల్ లా 5 రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌… ఈ అవినీతి ఆరోప‌ణ‌ల‌తో బీజేపి స‌త‌మ‌త‌మ‌వుతోంది.

సిబిఐ ముడుపుల వ్య‌వ‌హ‌రంలో… ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటు, దేశ ప‌రువును బ‌జారుకీడ్చిన అస్థానా… మోడీ-షాల ద్వ‌యానికి అత్యంత ఆప్తుడ‌ని అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న్ను కాపాడ‌టానికి మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, గ‌తంలో గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో త‌మ‌కు అండ‌గా ఉన్న ఆస్థానాకు ఇప్పుడు వీరు అండ‌గా ఉంటున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అయితే వీరిద్ద‌రి తో పాటు తాజాగా అరుణ్ జైట్లీ ఆర్థిక నేర‌గాడు నీర‌వ్  మోడీ, చోక్సీ కి దేశం విడిచి ప‌రార‌వ‌టానికి సహ‌క‌రించార‌ని రాహుల్ ఆధార‌ల‌తో స‌హ బ‌య‌ట‌పెట్ట‌డం బీజేపిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్ప‌టికే ఎంజె అక్బ‌ర్ రాజీనామా తో ప‌రువుపోగుట్టుకున్న బీజేపీ స‌ర్కార్ కు ఇది మ‌చ్చ‌గా మారింది.

ఓవైపు సీబిఐ ముడుపుల కేసు సంచ‌ల‌నం రేపుతుండ‌గానే, రాహుల్ మ‌రో బాంబు పేల్చారు. గీతాంజ‌లి జెమ్స్ కుంభ‌కోణంలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకును నిలువునా ముంచిన మొహుల్ చోక్సీ నుండి జైట్లీ కూతురు, అల్లుడుకు భారీ మొత్తంలో డ‌బ్బు అందింద‌ని, ఏ ఖాతాలో డబ్బు జ‌మ చేశారో ఆధార‌ల‌తో స‌హ బ‌య‌ట‌పెట్టారు. విజ‌య్ మాల్యా దేశం విడిచేందుకు, చోక్సీ పారిపోయేందుకు ఆర్థిక‌మంత్రే స‌హ‌యం చేశార‌ని… వెంట‌నే ఆయ‌న రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇలా పెద్ద‌నేత‌లంద‌రిపై మూకుమ్మ‌డిగా ప్ర‌తిప‌క్షాలు అవినీతిఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో… ఆత్మ‌ర‌క్ష‌ణ‌ళో ప‌డింది బీజేపి. దీన్ని నుండి ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*