బ‌ర్త్ డే బాయ్…. బాహుబ‌లి.

Read Time: 0 minutes

ఇండియ‌న్ సినిమా క‌లెక్ష‌న్ల రుచిని చూపించిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్… 16ఏండ్ల కేరీర్ లో దేశ‌వ్యాప్తంగానే కాదు, వ‌రల్డ్ వైడ్ ఫాన్స్ ను సంపాదించుకొన్నారు. త‌న 16సంవ‌త్స‌రాల కేరీర్ లో చేసింది 18 సినిమాలే అయినా, స్టార్ డమ్ ను సంపాదించుకొని, నెల‌బెట్టుకుంటున్న హీరో. ఏం ఉన్నాడు రా… అంటూ అమ్మాయిల మ‌తిపోయే కటౌట్ తో ప్ర‌భాస్ తెలుగు తెర‌ను మ‌రో ఎత్తుకు తీసుకెళ్లాడు.

ప్ర‌స్తుతం సాహో సినిమా ప‌నిలో బిజిగా ఉన్నాడు  ప్ర‌భాస్. 300కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జేట్ తో ప్ర‌భాస్ కొత్త సినిమా త్వ‌ర‌లో వ‌రల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబ‌లి త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌టంతో… అంచ‌నాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక సాహో త‌ర్వాత‌… పూజా  హెగ్ధేతో మ‌రో రొమాంటిక్ క‌థ‌తో రాబోతున్నాడు.  ఇప్పుడు ఏ సినిమా ప్లాన్ చేసినా… ఇండియ‌న్ లాంగ్వేజెస్ ను దృష్టిలో పెట్టుకొని, అంద‌రీకీ అప్పేలా సినిమా తీస్తున్నాడు.

స‌ల్మాన్, హృతిక్ లాంటి స్టార్ల‌కు కూడా ద‌క్క‌ని హోదా బాహుబ‌లితో ప్ర‌భాస్ సొంతం చేసుకోగా, అబ్రాడ్ క‌లెక్ష‌న్ల‌లో కూడా ఇండియ‌న్ స్టార్స్ తో ప్ర‌భాస్ పోటీలో ఉన్నాడు. ప్ర‌స్తుతం 39 ఏండ్ల‌లోకి అడుగుపెడుతున్న ప్ర‌భాస్… ఏడాదికో సినిమా, డ‌బ్బు అంటూ చూడ‌కుండా… ఏండ్ల‌కు ఏండ్లు ఓ సినిమాకే అంకిత‌మ‌వుతూ…. బాలీవుడ్ హీరోస్ ను త‌ల‌పిస్తున్నాడు. అందుకే టాలీవుడ్ లో ప్ర‌భాస్ కు ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.

అన్నీ ర‌కాల ప్రేక్ష‌కుల‌న మెస్మ‌రైజ్ చేసే ప్ర‌భాస్…. కు గ్రాండ్ గా బ‌ర్త్ డే విషేష్ చెప్తూ, పెళ్లేప్పుడో అంటున్నారు ఆయ‌న అభిమానులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*