ముదురుతోన్న ఏపీ పోలీసుల వివాదం, ఈసీ జోక్యం ఉంటుందా…?

Read Time: 0 minutes

ముదురుతోన్న ఏపీ పోలీసుల వివాదం, ఈసీ జోక్యం ఉంటుందా…?

ఏపీ పోలీసుల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని… ఇదీ టీఆర్ఎస్ నాయ‌కులు చంద్ర‌బాబు టార్గెట్ వేస్తున్న ప్ర‌శ్న‌లు. డ‌బ్బులు పంచుతున్నార‌ని ఒక‌రు, వ‌స్తే దాడులు చేయండ‌ని మ‌రోక‌రు ఎన్నో ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఈసీ కూడా ఎంట‌ర‌యి… ఏపీ పోలీస్ బాస్ కు లెట‌ర్ రాసి, సంజాయిషీ అడిగింది. దీంతో అగ్గి రాజుకున్న‌ట్లయింది.

అయితే… ఏపీ ఇచ్చిన సమాధానంతో ఎవ‌రి నోటా మాట రావ‌టం లేదు. పోలీసులు అంటే… పోలీసులే. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని మ‌నం ఏర్పరుచుకున్నాం. కానీ ఆంద్రాలో మావోల అల‌జ‌డి ఎక్కువ‌గా ఉంది. ఇటీవ‌లే  ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా చంపారు. అందుకే… త‌మ నిఘా త‌మ‌కు ఉంటుంది. మావోల క‌ద‌లిక‌ల‌పై నిఘా పెడుతాం. అది ఎప్పుడూ జ‌రిగిదే. కొత్త‌దేం కాదు… ఇక మీద‌టా ఉంటుంది. మా వారు డ‌బ్బుల‌తో దొర‌క‌లేదు, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో మావోలు అక్క‌డి స్థానికులు. అందుకే అక్క‌డ స‌మాచారం కోసం ఉన్నాం అని జావాబు వ‌చ్చింది. దీంతో టీర్ఎస్ నేత‌ల‌కు నోట మాట రావ‌టం లేదు. ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నంచేస్తూ… త‌మ నాయ‌కుడిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఓట్ల కోసం దిగజారి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఏపీ పోలీసులు తెలంగాణ‌లో బందోబ‌స్తు వ‌ద్దంటూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. కానీ ఇప్పుడు  ఏపీ ఇంట‌లిజెన్స్ ను నివారించే నిర్ణ‌యం తీసుకుంటుందా…?  వారి ప్రాంత నిఘా కోసం ఏర్పాటు చేసుకున్న యంత్రాంగాన్ని నివారిస్తుందా  చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*