మూడు నెల‌ల్లో స‌ర్పంచ్ ఎన్నిక‌లు… ఇక అంతా ఎన్నిక‌ల సంద‌డే

Read Time: 0 minutes

తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్టు అల్టీమేటం జారీ చేసింది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేసి, ప్ర‌త్యేకాధికారుల పాల‌నలో పాల‌న న‌డిపిస్తున్న స‌ర్కార్ కు మొట్టికాయలు వేసింది. ఎన్నిక‌ల‌కు ఎందుకు స‌న్న‌ద్దం కాలేదంటూ ప్ర‌శ్న‌లు వేసింది.

టీఆర్ఎస్ స‌ర్కార్… స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు హ‌డావిడి చేసినా, బీసీ ఓట‌ర్ల జాబితా స‌రిగ్గా లేక‌పోవ‌టంతో వాయిదాప‌డింది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా… ముంద‌స్తుకు వెళ్లాలా లేదా అన్న అంశాన్ని డిసైడ్ చేయాల‌ని మొద‌ట్లో కేసీఆర్ నిర్ణ‌యించారు. కానీ చివ‌రి నిమిషంలో ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టం, సాదార‌ణ ఎన్నిక‌ల సమ‌యానికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అంచానాకు రాక‌పోవ‌టంతో… ఆయ‌న అసెంబ్లీనే ర‌ద్దుచేశారు. దీంతో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌టం లేదు. కానీ ఈ ముంద‌స్తు ఎన్నిక‌లు రెండు  నెల‌ల్లోపు పూర్తికాబోతున్నాయి. ఇలా ఈ ఎన్నిక‌లు పూర్త‌వుతాయో లేదో… మ‌ళ్లీ స‌ర్పంచ్ ఎన్నిక‌ల సంద‌డి మొద‌ల‌వుతుంది. అప్పుడు గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు ఖ‌ర్చులు మ‌ళ్లీ మొద‌టికొస్తాయి. దీంతో తాజా హైకోర్టు నిర్ణ‌యం రాజ‌కీయా నాయ‌కులంద‌రికీ, పార్టీల‌కు అతీతంగా విస్మ‌యానికి గురిచేసింద‌నే చెప్పుకోవ‌చ్చు.

ఇదే జ‌రిగితే రెండు నెల‌ల్లోపు అసెంబ్లీ ఎన్నిక‌లు, అవి ముగిసే నెలలోపు స‌ర్పంచ్ ఎన్నిక‌లు, అవి పూర్త‌య్యేలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు. ఇలా ఈ ఆరు నెల‌లంతా… ఎన్నిక‌ల హ‌డావిడితో రాష్ట్రంలో పండ‌గ వాతావ‌ర‌ణం క‌న‌ప‌డ‌బోతుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*