మోడీ టీం… ఫ‌స్ట్ వికెట్ డౌన్

Read Time: 1 minutes

సినీ,రాజ‌కీయ‌,పాత్రికేయ రంగాల్లో… సంచ‌ల‌నం సృష్టిస్తున్న  #MeToo ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర‌మంత్రి ఎంజె అక్బ‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామ చేశారు. జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో… మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న దిగిరాక త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే రాఫెల్ డీల్ విష‌యంలో మోడీ సర్కార్ అతిపెద్ద అవినీతి మ‌ర‌క అంటించుకుంది. తాజాగా మోడీ కేబినెట్ స‌హ‌చ‌రుడు లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొవటం, కాంగ్రెస్ పార్టీ రాజీనామ‌కు డిమాండ్ చేయ‌టం… త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

దీనిపై ప‌లువురు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది మహిళలందరి విజయంలో మొదటి అడుగుగా అభివర్ణించారు. ఎట్టకేలకు రెండు వారాలుగా 20 మంది మహిళా జర్నలిస్టులు ఒక్కొక్కరుగా తమను అక్బర్ ఎలా లైంగికంగా వేధించారో ధైర్యంగా ప్రపంచానికి తెలియజెప్పినందుకు ఫలితం దక్కిందని వ్యాఖ్యానించారు. మొద‌ట ఎంజె అక్బ‌ర్ పై ఆరోప‌ణ‌లు చేసిన జ‌ర్న‌లిస్ట్ ప్రియా ర‌మణిపై ఇప్ప‌టికే ప‌రువు న‌ష్టందావా కేసు దాఖ‌లు అయింది. అయితే, ఈ కేసులోనూ…  త్వరలోనే  అక్బర్ కి ఎదురుదెబ్బ తప్పదన్నారు. ఆయనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియా రమణి కోర్టులో కూడా తనకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికే కొంద‌రు బాలివుడ్ ద‌ర్శ‌కులు, ప‌లువురు సెల‌బ్రిటీల‌పై కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు వ‌స్తూ… సంచ‌ల‌నం రేపుతున్నాయి. #MeToo పేరుతో న‌డుస్తున్న ఉద్య‌మం రోజురోజుకు దేశ‌మంతా పాకుతోంది.

ఇక‌, తెలంగాణ‌లో కూడా ఈ లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర‌య్యాయి. కాస్టింగ్ కౌచ్ ఉదంతంలో టాలీవుడ్ ఇండ‌స్త్రీ లో జ‌రుగుతున్న చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌రెడ్డి, తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్ తాజామాజీ జీవ‌న్ రెడ్డి త‌న‌ను బ‌ల‌వంతం చేశార‌ని ఆరోపించారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*