మ‌రోసారి పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స‌మంత‌-చైతూ

Read Time: 1 minutes

టాలీవుడ్ లో క‌ల‌ర్ ఫుల్ జోడిగా పేరుతెచ్చుకున్న జంట సామ్-చైతూల‌ది. ఇప్ప‌టికే… ర‌క‌ర‌కాల ఫోటోలు, వీడియోలు పెడుతూ… ఫాన్స్ కు ట‌చ్ లో ఉంటారు. అయితే… ఈ జంట మ‌రోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. అదేంటి ఇప్ప‌టికే పెళ్లి అయింది క‌దా, పైగా క్రిస్టియ‌న్ క‌మ్ హిందూ మ్యారేజ్ రెండు అయ్యాయ‌నే క‌దా మీ డౌట్…. నిజ‌మే వీరు పెండ్లి చేసుకోబోతుంది రాబోయే కొత్త సినిమాలో.

నిన్నుకోరి  దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో వీరిద్ధ‌రు ఓ సినిమా చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇందులో సమంత, చైతు భార్యాభర్తలుగా కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో సోä్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. బాగా వైర‌ల్ అయిన ఈ వీడియోను ఓ అభిమాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పెట్టి, సామ్ ను, చైతూను ట్యాగ్ చేశాడు. పైగా… ఈ వీడియో చూసిన తరువాత అధ్బుతమైన భావన కలిగింది. అందమైన జంట.. మీరు చైతన్యతో ఏదైనా టాప్ సీక్రెట్ మాట్లాడుతున్నారా.. సమంత. మజిలీ సినిమా విశేషాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం  అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో చూసిన సామ్ కూడా… అతడి ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ.. షాకింగ్ ఎమోజీలను పోస్ట్ చేసి, కాస్సేప‌టికే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.

అయితే, ఈ కొత్త సినిమా కు ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా  పేరు ఖ‌రారుచేయ‌క‌పోయినా, మ‌జిలీ అనే పేరు బాగానే వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో ఇద్ద‌రు క‌లిసి న‌టించి, అందాలు ఆర‌బోసిన సామ్… ఈ సినిమాలో ఎన్ని అందాలు చూపిస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*