రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి వెంటేనంటున్న‌ తుంగ‌తుర్తి ప్ర‌జ‌లు

Read Time: 0 minutes

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌…పార్టీల‌న్నీ ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు వెళ్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. నల్గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పోటాపోటీ ప్ర‌చారాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. అయితే, ఇక్క‌డ ఓవైపు పార్టీలో టికెట్ కోసం పోటీ ప‌డుతూనే, మ‌రోవైపు ప్ర‌చారం లో దూసుక‌పోతున్నారు స్థానిక నేత డా.ర‌వి.

గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి  ప్రాధ‌న్యం వ‌హించి, ఇప్ప‌టికీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిప‌ట్టున్న మాజీమంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఇప్ప‌టికీ ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మమేక‌మ‌వుతున్నారు. తాను సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీలో ఉన్నా, తుంగ‌తుర్తి ప్ర‌జ‌ల కోరిక మేర‌కు… ఇక్క‌డ కూడా గెలుపును త‌న భుజాన వేసుకొని, పార్టీ అభ్య‌ర్థికోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి కొడుకు స‌ర్వొత్తంరెడ్డి అయితే… నియోజ‌క‌ర్గంలోనే మ‌కాం వేసి, వారి ప్రాధాన్య‌త‌ను చాటుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇక తుంగతుర్తిలో వీరికి విశేష ఆధార‌ణ ల‌భిస్తోంది. డాక్ట‌ర్ ర‌వి కోసం చేస్తున్న ప్ర‌చారం స‌క్సెస్ అవుతున్న‌ట్లే ఉంద‌న్న జోష్ లో ఉంది అక్క‌డ క్యాడ‌ర్.

Suryapet

అక్క‌డ అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు, ఆ పార్టీ అభ్య‌ర్థి పై ఇప్ప‌టికే ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కాంగ్రెస్ పార్టీకి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థంప‌డుతున్న‌ట్లుగా క‌న‌ప‌డుతోంది. రోజుకో రెండు, మూడు గ్రామాలు కాంగ్రెస్ కు మాత్ర‌మే ఓటు వేస్తామంటూ ముక్త‌కంఠంతో ఏక‌గ్రీవ తీర్మానాలు చేస్తూ, నాయ‌కుల‌కు అందిస్తున్నాయి. వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు… టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవి రోజురోజుకు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో, తుంగ‌తుర్తిలో ర‌వి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*