రాహుల్ మీటింగ్ పై… కాంగ్రెస్ మైండ్ గేమ్ స‌క్సెస్

Read Time: 0 minutes

కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రాబోతున్నారు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌… ప్ర‌చారంలోకి దూక‌బోతున్నారు. ఈనెల 20న రాహుల్ రెండు కీల‌క స‌భ‌ల‌కు అటెండ్ కావటంతో పాటు, మ‌హ‌కూటమి పొత్తులు, ప్ర‌చార స‌ర‌ళి, అభ్య‌ర్థుల ఎంపిక‌పై సీనీయ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

అయితే, సోనియా, రాహుల్ మీటింగ్స్ ను వీలైనంత ఎక్కువ‌గా వాడుకోవాలన్న ఆలోచ‌న‌ను ఇంప్లిమెంట్ చేసే ప‌నిలో పీసీసీ స‌క్సెస్ అయితున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. రాహుల్ మీటింగ్ కోసం కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ బాగానే వ‌ర్క‌వుట్ అవుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. రాహుల్ మీటింగ్స్ డేట్స్ ఫైన‌ల్ కాగానే… రాహుల్ ప‌ర్య‌ట‌న రోజు టీఆరెస్ నుండి బారీగా వ‌ల‌స‌లుంటాయని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్ర‌చారం చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం, రంగారెడ్డి జిల్లా నుండి చైర్మ‌న్, అదిలాబాద్ స‌భ‌లో ఓ మాజీ మంత్రి, ప‌లువురు తాజామాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నార‌ని నేత‌లు లీకులిస్తుండ‌టంతో… కాంగ్రెస్ నేత‌ల్లో జోష్ నింపుతుండ‌గా, టీఆరెఎస్ నేత‌ల గుండెల్లో రైల్లు ప‌రుగెడుతున్నాయి. ఈ వార్త‌లు నిజ‌మే అయితే, ఖ‌చ్చితంగా కాంగ్రెస్ మ‌రింత స్పీడ్ పెంచుతుంద‌ని, ఊగిస‌లాట‌లో ఉన్న మ‌రికొంత‌మంది నేత‌లు పార్టీ జంప్ చేయ‌డానికి  సిద్ధ‌మ‌వుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదంతా టీఆర్ఎస్ పై మైండ్ గేమ్ అని అధికార‌పార్టీ నేత‌లు నెత్తి,నోరు మొత్తుకున్న వినే ప‌రిస్థితి అయితే క‌న‌ప‌డ‌టం లేదు.

ఇప్ప‌టికైతే… ప్లాన్ వ‌ర్క‌వుట్ అయింద‌ని, చేరిక‌లు నిజంగానే జ‌రిగితే… త‌మ‌కు ఎదురే ఉండ‌ద‌న్న‌ది పీసీసీ ప్లాన్. మ‌రీ చేరిక‌ల‌ను అడ్డుకునేందుకు చేస్తున్న బుజ్జ‌గింపులు ఫ‌లిస్తే మాత్రం… కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*