రియ‌ల్ హీరో….. మార్గ‌ద‌ర్శకుడు రాఘ‌వ లారెన్స్

Read Time: 1 minutes

సిని హీరో అంటే… ఆద‌ర్శ‌వంతంగా ఉండాలే అనే చెప్పుకునే వారికి రాఘ‌వ లారెన్స్ రియ‌ల్ ఎగ్జామ్ పుల్ గా మారాడు. డాన్స్ మాస్ట‌ర్ గా, మంచి న‌టుడుగా, క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఘ‌వ‌… రియ‌ల్ లైఫ్ లో అనాథ పిల్ల‌ల‌ను చేర‌దీస్తూ, వారిని ఆదుకోవ‌టంలో ఎప్పుడూ ముందుంటాడు.

ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు… పిల్ల‌ల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండె సంబందిత రోగాల‌తో బాధ‌ప‌డే పేద‌, అనాథ పిల్ల‌ల‌కు రాఘ‌వ ఉచితంగా వైద్యం చేయిస్తాడు. ఇప్ప‌టికే అనేక గుండె ఆప‌రేష‌న్లు చేయించి… త‌న మంచి మ‌న‌స్సును చాటుకున్న రాఘ‌వ లారేన్స్, సోష‌ల్ మీడియా ద్వారా త‌న సంతృప్తిని పంచుకున్నాడు. రీసెంట్ గా ఓ చిన్నారికి చేయించిన ఆప‌రేష‌న్ ద్వారా 150 స‌ర్జ‌రీలు చేయించినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. కావ్య‌శ్రీ అనే చిన్నారికి ఈ 150వ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా చేశారు.

త‌న‌కు అండ‌గా ఉంటున్న డాక్ట‌ర్లంద‌రికీ… ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆయ‌న‌, జ‌బ్బు బారిన ప‌డి డ‌బ్బు చెల్లించలేని వారు  లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాలని కోరారు. అందుకోసం రెండు ఫోన్ నెంబ‌ర్లు కూడా ఇచ్చారు.  లారెన్స్ ఫోన్ నెంబర్స్– 09790750784, 09791500866

రాఘ‌వ లారెన్స్ పెట్టిన పోస్టుకు అభిమానులు, నెటిజ‌న్లు భారీగా స్పందిస్తున్నారు. నిజ‌మైన హీరో రాఘ‌వ లారెన్స్ అంటూ… షేర్ చేస్తున్నారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*