రైతుల ఖాతాల్లోకి… రైతుబంధు.

Read Time: 0 minutes

ఎన్నిక‌ల హ‌డావిడిలోకి వెళ్ల‌టంతో… ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఏర్ప‌డిన సందిగ్ధ‌త విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తోంది. కొత్త ప‌థ‌కం కాద‌న్న కార‌ణంగా… ఎన్నిక‌ల క‌మీష‌న్, హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో… రెండోవిడ‌త రైతుబంధు ప‌థ‌కం డ‌బ్బు రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసేందుకు ప్ర‌భుత్వం అధికారిక ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

మొద‌టివిడ‌త‌గా… 1,51,466మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తం 162కోట్ల మొత్తం ఒకే విడుత‌లో బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు ఆర్థిక‌శాఖ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. సోమ‌వారం సాయంత్రానికల్లా రైతుల అకౌంట్ల‌లోకి డ‌బ్బు చేరుతుంద‌ని, వెంట‌నే ఓ మెసెజ్ కూడా వ‌స్తుంద‌ని అధికారులు తెలిపారు.

కేవ‌లం పేద‌రైతుల‌కు కాకుండా… భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి రైతుబంధు వర్తించేలా ప్ర‌భుత్వం గ‌తంలో నిర్ఱ‌యం తీసుకోవ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌యినా నాటి ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. రైతుబంధు పేరుకే ఉంద‌ని, రైతులు కాని వారికి కూడా… స‌హాయం ఎందుక‌ని వారి ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, కొత్త స‌ర్కార్ ఏది వ‌చ్చినా, దీనిపై రివ్యూ చేయాల‌న్న ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతండ‌టం గ‌మ‌నార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*