రౌడీ కేసీఆర్ కు హ‌రీష్ భ‌యంప‌ట్టుకుందా….?

Read Time: 0 minutes

సీఎం కేసీఆర్ కు త‌న మేన‌ల్లుడు హ‌రీష్ రావు భ‌యం ప‌ట్టుకుంది. అందుకే  భ‌యం, భ‌యం తో కేసీఆర్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు అని విమ‌ర్శిస్తున్నారు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి. ఓట‌మి భ‌యంతో కేసీఆర్ చేసే ఆరోప‌ణ‌లు ప్ర‌తిప‌క్షాల‌కే మ‌రింత మేలు చేస్తాయ‌ని… కొంగ‌ర్ క‌లాన్ స‌భ‌లాగే, కేసీఆర్ వ‌న‌ప‌ర్తి స‌భ కూడా ప్లాప‌యింద‌ని విమ‌ర్శించారు. స‌రే, కాంగ్రెస్ పార్టీ పాల‌మూరుకు నీరివ్వ‌లేద‌నే అనుకుందాం… మ‌రీ నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు క‌ట్టారు, ఎన్ని ఏక‌రాల‌కు నీరిచ్చారు అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ లాంటి బూతులు మాట్లాడే వ్య‌క్తి రాజ‌కీయాల్లో ఉండ‌టం చూస్తుంటే ఆస‌హ్యం వేస్తుంద‌ని…కేసీఆర్ పాల‌మూరు జిల్లాలో ఓపెనింగ్ లకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు.

కేసీఆర్ రౌడీలా మాట్లాడుతున్నార‌ని, కాళేశ్వ‌రం ప్రాజెక్టు చేప‌ట్టినంత స్పీడ్ గా, ప‌నులు చేస్తున్నంత స్పీడ్ గా ఎందుకు పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప‌నులు ఎందుకు  జ‌ర‌గ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదేనా… పాల‌మూరు జిల్లాపై కేసీఆర్ కు ఉన్న ప్ర‌త్యేక ప్రేమ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికారం ద‌క్క‌ద‌న్న ఆందోళ‌న‌లోనే బూతులు మాట్లాడుత‌న్నార‌ని, కేసీఆర్ కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్… రాజ‌కీయ జీవితానికి మ‌రో రెండు నెల‌ల్లో ఎండ్ కార్డు ప‌డుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*