వీర‌బాదుడు బాదిన షా

Read Time: 0 minutes

ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు, బుల్లెట్ దిగిందా లేదా… అన్న‌ట్లు ఆడాడు కొత్త కుర్రాడు పృద్వీషా. వెస్టిండీస్ తో జ‌రుగుతున్న తొలిమ్యాచ్ లోనే సెంచ‌రీ బాదీ త‌న టాలెంట్ ఎంటో రుచిచూపించాడు. అరంగ్రేటం మ్యాచ్ లోనే సెంచ‌రీ కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. కేవ‌లం 18 సంవ‌త్స‌రాల 329రోజుల వ‌య‌స్సున్న షా… త‌న మార్క్ షాట్ల‌తో అల‌రించీ, సీనీయ‌ర్ల ప్ర‌శంస‌లు పొందుతున్నాడు. భ‌విష్య‌త్ స్టార్ గా మ‌న్న‌లందుకుంటున్నాడు.

సోష‌ల్ మీడియాలో త‌న‌దైన స్టైల్ లో స్పందించే మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరూ…. ఈపిల్లాడిలో ఎంతో ద‌మ్ ఉంది, ఇంకా రోబోవు రోజుల్లో మ‌రింత మెరుగ్గా రాణిస్తాడు… ఇది పూర్తిగా షా షోనే అంటూ ట్వీట్ చేశాడు.

ఇక‌, భార‌త్ త‌రుపున ఇంత చిన్న వయ‌స్సులో సెంచ‌రీ సాధించిన రెండో  వ్య‌క్తిగా రికార్డుకెక్క‌గా, ఓవరాల్ గా 10వ స్థానంలో ఉన్నారు. కానీ అరంగ్రేటంలోనే సెంచ‌రీ సాధించిన రికార్డును మాత్రం త‌న పేరుపైనే క్రియేట్ చేశాడీ కుర్రాడు. ఇక క్రికెట్ ప్ర‌పంచంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మాద్ అష్రాఫుల్ 17 ఏళ్ల 61 రోజుల వయసులో సెంచరీ నమోదుచేసి, అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్‌గా మొదటి స్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్థానంలో పాక్ క్రికెటర్ ముస్తక్ మహ్మద్ (17 సంవత్సరాల 78 రోజులు) ఉన్నాడు. మూడో స్థానంలో సచిన్ టెండుల్కర్ (17 ఏళ్ల 107 రోజులు) నిలిచాడు. టాప్ 10లో మూడు స్థానాల్లో సచిన్ టెండుల్కర్ ఉండడం విశేషం. 18 ఏళ్ల 246 రోజుల వయసులో రెండో సెంచరీ, 18 ఏళ్ల 253 రోజుల వయసులో మూడో సెంచరీ బాదిన సచిన్… 7, 8 స్థానల్లోనూ నిలిచాడు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*