వైఎస్ జ‌గ‌న్ పై హాత్య‌కు కుట్ర‌….

Read Time: 0 minutes

ఏపీ ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్ రెడ్డిపై హాత్యాయ‌త్నం జ‌రిగింది. హైద‌రాబాద్ వ‌చ్చేందుకు… విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో వెయిట్ చేస్తున్న జ‌గ‌న్ పై క్యాంటిన్ వెయిట‌ర్ దాడి చేశారు. కోడిపందెల‌కు ఉప‌యోగించే క‌త్తితో దాడికి పాల్ప‌డ‌టంతో… అక్క‌డున్న వారంతా షాక్ గుర‌య్యారు. వెంట‌నే తెరుకొని అత‌న్ని ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు.

వైఎస్ జ‌గ‌న్ పై దాడి చేసింది వైజాగ్ కు చెందిన శ్రీ‌నివాస రావుగా గుర్తించారు. అత‌ను ఎయిర్ పోర్టు క్యాంటిన్ లో వెయిట‌ర్ గా పనిచేస్తున్నాడు. నెల‌న్న‌ర క్రిత‌మే ప‌నిలో చేరాడు. ఆ క్యాంటీన్ తెలుగుదేశం నేత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కు చెందిన‌ది గా గుర్తించారు. గ‌తంలో గాజువాక సీటు కోసం ప్ర‌య‌త్నించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్… తెలుగుదేశం నేత‌ల సిఫార‌సుతో వైజాగ్ ఎయిర్ పోర్టు క్యాంటిన్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూన్నారు. గ‌వ‌ర్న‌ర్, పౌర‌విమానాయాన శాఖ‌మంత్రి సురేష్ ప్ర‌బు, ఏపీ మంత్రి లోకేష్ స‌హా ఏపీ డీజీపీ ఘ‌ట‌న‌పై స్పందించారు. విచార‌ణ‌కు ఆదేశించారు. అయితే… ఇది ఏపీ పోలీసుల నిర్ల‌క్ష్యం అని, భ‌ద్ర‌త సరిగ్గా లేద‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అయితే, ఎయిర్ పోర్టు భ‌ద్ర‌త త‌మ ప‌రిధిలో లేద‌ని, బ‌య‌టి వ‌ర‌కే స్థానిక పోలీసుల భ‌ద్ర‌త అని ఏపీ డీజీపీ స్ప‌ష్టం చేశారు.

స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన వైఎస్ జ‌గ‌న్ యాధావిధిగా… హైదారాబాద్ చేరుకున్నారు. అయితే… అప్ప‌టికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్ర‌త్యేక డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు చికిత్స చేసింది. అయితే… ఆ క‌త్తికి ఏదైనా ర‌య‌సానాలు పూసారా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*