
సెమీ ఫైనల్ సంగ్రామంలో కీలక రాష్ట్రం మద్యప్రదేశ్, బీజేపీకి పెట్టని కోట. 15 సంవత్సారాలుగా… కాంగ్రెస్ కు ఒక్క చాన్స్ ఇవ్వకుండా… ఏకచక్రాధీపత్యంతో ముందుకెళ్తుంది. వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ సీఎంగా దిగ్విజయ్ సింగ్, బీజేపీకి అధికారం ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ కాంగ్రెస్ కు అవకాశం కూడా కాదు, అసలు చాన్సే ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు… మద్యప్రదేశ్ లో బీజేపీ ఎంత స్ట్రాంగో. అక్కడ బీజేపీ కోటకు కాంగ్రెస్ నేతలు బీటలు వేస్తారా…? ఎదురేలేని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎదురు నిలబడగలుగుతారా….? మినీ సంగ్రామంలో మద్యప్రదేశ్ ముఖచిత్రం.
మద్యప్రదేశ్ లో దాదాపు మూడుసార్లు సీఎంగా ఉండి, నాలుగో సారి పోటీలో ఉన్నా… అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో రైతు సమస్యలు ఈ సారి ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. మామ అని ముద్దుగా మద్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ను అక్కడ ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. శివరాజ్ సింగ్ కు జనం మద్దతుగా ఉండేవారు. మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా… కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నా, బీఎస్పీ కూడా అక్కడ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అక్కడ కాంగ్రెస్ బీఎస్పీని కలుపుకోవాలని వెళ్లేందుకు ప్రయత్నించినా, చివరి నిమిషంలో మాయావతి హ్యండిచ్చారు.
మద్యప్రదేశ్ లో కాంగ్రెస్ పునర్వైభవం కోసం సీనీయర్ నేత కమళనాథ్ పార్టీ ప్రెసిడెంట్ గా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జ్యోతిరాధిత్య సింధియా స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దాటి వెళ్లటం బీజేపీ కి సవాల్ గా మారింది. కొద్దిరోజుల ముందు జరిగిన మద్యప్రదేశ్ 3 ఉప ఎన్నికల్లో, మంత్రులు అంతా అక్కడే ఉన్నా, సీఎం ఏకంగా 20కి పైగా సభల్లో ప్రచారం చేసినా… మూడింట్లోనూ గెలవలేకపోయారు. దీన్ని బట్టి బీజేపీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బీజేపీని ఓడించటం ద్వారా… జాతీయ రాజకీయాల్లో చలనం తీసుకరావటం, లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో జోరు నింపవచ్చని కాంగ్రెస్ ఆరాటపడుతోంది.
ఇక్కడ రాహుల్ ఇప్పటికే ప్రచారం కూడా నిర్వహించగా, మరిన్ని సభల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. వీటికి తోడు జాతీయస్థాయిలో సర్వేలన్నీ మద్యప్రదేశ్ హస్తగతం అవుతుందని స్పష్టం చేస్తుండటం, కాంగ్రెస్ కు మరింత జోష్ పెంచుతుంది.
Leave a Reply