హీరోయిన్ తో లిప్ లాక్, భ‌ర్త‌కు విడాకులు.

Read Time: 1 minutes

బాలీవుడ్ లో అందాలు ఆర‌బోయడాలు కొత్తేం కాదు. హాట్ హాట్ సీన్లు బోలేడు. మంచి కిక్కేంచే స‌న్నివేశాల్లో న‌టించటంలో… హీరోయిన్స్ తో పోటీప‌డ‌టంలో హీరోలు ముందుంటారు. కానీ ఓ సినిమాలో హీరోయిన్ తో ఘాటైన లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలు చేసినందుకు… ఏకంగా విడాల‌కుల వ‌ర‌కు వెళ్లింద‌ట స‌ద‌రు హీరో భార్య‌.

సినిమా చేసినంత సేపు ఎంజాయ్ చేసిన ఆ హీరో… సినిమా రిలీజ్ అయ్యాక ఈ రోమాన్స్ పై భార్య నిల‌దీస్తుంటే… ఎం చేయాలో తెలియ‌క మూడేళ్లు న‌ర‌కం చూశాడ‌ట బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. కొన్నేళ్ల క్రితం… విక్కీ డోన‌ర్ సినిమా చేశాడు. ఆ సినిమాలో యామీ గౌత‌మీ తో బాగానే రోమాన్స్ చేయాల్సి వ‌చ్చింది. యామీ గౌత‌మి-ఆయుష్మాన్ ఖురానా పోటీప‌డి మ‌రీ… లిప్ లాక్ సీన్స్, రోమాన్స్ పండించి ఔరా అనిపించార‌ట‌. దీంతో… సినిమా రిలీజ్ కాగానే హీరో భార్య సినిమా చూసి… మూడేండ్ల వ‌ర‌కు  స‌రిగ్గా మాట్లాడ‌లేద‌ట‌. పైగా ఆ విష‌యం సీరీయ‌స్ అయి… విడాకుల వ‌ర‌కు వెళ్లింద‌ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు స‌ద‌రు హీరో.

అయితే… గ‌తంలో ఉన్న ఆ ఇబ్బందులు, అబ్యంత‌రాలు ఇప్పుడేమీ లేవ‌ని… ఎన్నీ ముద్దుసీన్లు చేసినా నా భార్య ఇప్పుడేమీ అన‌టం లేద‌ని చెప్ప‌టం కొస‌మెరుపు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*