అక్కినేని వారి స‌రదా స‌ర‌దా… స్పెష‌ల్ పిక్స్. విలేఖ‌రీ.నెట్

Read Time: 0 minutes

స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌టంలో… గ్లామ‌ర్ ఇండ‌స్త్రీకి పెద్ద షేరే ఉంటుంది. ఇప్పుడు స‌మంతా ఫ్యామిలీ కూడా త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్ నుండి ఓ కొత్త విష‌యం ప్ర‌పంచానికి కూడా చెప్పింది. ఈ బిజీ లైఫ్ లో ఎవ‌రు ఎక్క‌డెంటారో, ఎలా ఉంటారో, ఎప్పుడు క‌లుస్తారో చెప్ప‌లేం. అంత తీరిక కూడా ఉండ‌దు. అలాంటి కుటుంబ‌మే స‌మంత‌ది. అక్కినేని కుటుంబంలో కోడ‌లుగా వ‌చ్చిన స‌మంత‌తో పాటు, నాగ్, అమ‌ల‌, చైతూ, అఖిల్ ఇలా అంతా బిజీబిజీనే. కానీ వీరు రెగ్యూల‌ర్ గ్యాప్ తో వెకేష‌న్ కు వెళ్తూ… ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటారు.

Akkineni

ఇటీవ‌లే సమంత న‌టించిన యూట‌ర్న్ సినిమా, చైతూ న‌టించిన శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ కాగానే… ఇద్ద‌రు అప్ప‌టికే వెకేష‌న్ లో ఉన్న నాగ్, అమ‌ల‌తో జాయిన్ అయ్యారు. వారికి తోడుగా… అఖిల్. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేశారు. త‌మ వ‌ర్క్ బిజీ అంతా మ‌ర్చిపోయి… టెన్షన్ ల‌కు దూరంగా గ‌డిపేసారు.

Naga chaitanya

తాము మ‌ళ్లీ మాములు జీవితంలోకి వ‌చ్చేశాము, హ‌లిడేస్ అయిపోయిన‌ట్లే అని నాగ్ ట్వీట్ తో ఫ్యాన్స్ కు మెసెజ్ ఇస్తే, స‌మంతా… త‌న పెళ్లిరోజు ను గుర్తుచేసుకుంటూ, జాలీడేస్ ముగించుకొని తిరిగొచ్చేశాము అంటూ ట్వీట్ చేసింది.

Samantha

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*