అమిత్ షా టూర్ హిట్టా.. ప్లాపా…?

Read Time: 0 minutes

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్ ఆయ‌న‌. ఒంటిచెత్తో బీజేపీని దేశంలో జెండాలు పాతిస్తున్న చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడు ఆయ‌న‌. ఆయ‌న అడుగుపెడితే… ఆ స్టేట్ బీజేపీ సొంతం కావాల్సిందే అన్న ప్ర‌చారం ఉన్న నేత‌. కానీ తెలంగాణ‌లో అడుగుపెడితే… క‌నీసం జ‌నాల‌కు అయినా తెల్వ‌దా…. అంటే తెల్వ‌కుండానే వ‌చ్చారు, పోయారు అన్న‌ట్లుంది అమిత్ షా టూర్.

ఎదో.. ఓ బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చామా వెళ్లామా అన్న‌ట్లు చ‌ప్ప‌గా సాగింది ఆయ‌న టూర్. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయ‌కుడు వ‌స్తే… మాములుగా హ‌డావిడి ఉండదు. కానీ రాష్ట్రంలో స‌గం మందికి అయితే, ఆయ‌న వ‌చ్చిన‌ట్లే తెలియ‌దు. ఎక్క‌డా హాడావిడి, ప్ర‌చారం లేనేలేదు. ఎన్నిక‌లు లేకుండా, ఎదో ఓ స‌భ పెట్టుకొన వ‌స్తే ఎట్లా ఉంట‌దో… అంత‌క‌న్నా ఆద్వాన్నంగా ఉంది. స‌భ ఆర్గ‌నైజేష‌న్ ప‌క్క‌న‌పెడితే, ఆయ‌న బీజేపీ ఆఫీసులో కూడా ఓ మీటింగ్ పెట్టి మ‌మ అనిపించారు త‌ప్పా, ప‌క్కాగా అధికారంలోకి రావాలి, ఎలాగైనా… ఓడించాలి అన్న ప‌ట్టుద‌ల అయితే క‌న‌ప‌డ‌ట లేదు. ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌పై అసంతృప్తితో ఉన్న కేడ‌ర్, కేంద్ర నాయ‌క‌త్వ తీరుపై కూడా పెద‌వి విరుస్తున్నారు. ఇదేందీ… ఎదో ఓ లోపాయ‌కార ఒప్పందం ఉందేమో, అందుకే బ‌య‌ట‌కు పొక్క‌కుండా, టీఆర్ఎస్ కు ఇబ్బంది కాకుండా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. ఓ వైపు మ‌హ‌కూట‌మి పేరుతో కాంగ్రెస్ హ‌డావిడి చేస్తుంటే, ప్ర‌చారం పేరుతో టీఆర్ఎస్ దూసుక‌పోతుంటే… అభ్య‌ర్థులు లేక‌, పార్టీకి డైర‌క్ష‌న్ లేకుండా ఎలా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాగే ఉంటే, ఉన్న 5సీట్లు కూడా వ‌చ్చేలా లేవ‌న్న‌ది కార్య‌క‌ర్త‌ల మ‌నోగ‌తం.

అయితే, ఈ వ్య‌వ‌హారాన్ని… ఆరెస్సెస్ తో డీల్ చేయాల‌న్న వాద‌న కూడా విన‌ప‌డుతోంది. చూడాలి మ‌రీ…బీజేపీ ప‌రిస్థితి ఏమైనా మేరుగ‌వుతుందో,లేదో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*