ఆర్మూర్ జీవ‌న్ రెడ్డిపై చ‌ర్య‌లుంటాయా…?

Read Time: 0 minutes

పార్టీ నేత‌లు గీత దాటితే… స‌హించేది లేద‌ని చెప్పే కేసీఆర్, ఆర్మూర్ జీవ‌న్ రెడ్డి విష‌యంలో స్పందిస్తారా అన్న చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో బాగానే న‌డుస్తోంది. స్వ‌యంగా ఓ మ‌హిళా… టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేపై నేరుగా విమ‌ర్శ‌లు చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న జీవ‌న్ రెడ్డి అమ్మాయిల పిచ్చోడు, న‌న్ను బ‌ల‌వంతం చేశాడు, ఆయ‌న వెన‌క చాలా మంది పెద్ద నేత‌లున్నారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ నేత‌లెవ‌రూ నోరు విప్ప‌టం లేదు.

అయితే, ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌టంతో…  ఓ మ‌హిళ స్వ‌యంగా త‌న‌ను బ‌ల‌వంతం చేశాడ‌ని చెప్ప‌టం టీఆర్ఎస్ కు రాజకీయం గా ఇబ్బందిగా మారింది. ఇప్ప‌టికే ఇదే ఇష్యూను ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్ర‌చారం చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ వీలైనంత ఎక్కువ‌గా వాడుకోవాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో మాసారు దీనిపై ఏ మైన ప్ర‌క‌ట‌న చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం సొంత‌పార్టీలోనే వినిపిస్తోంది. దీని ద్వారా అంద‌రికీ చెడ్డ పేరు వ‌చ్చేలా ఉంద‌ని, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఈ అంశానికి వీలైనంత త్వ‌ర‌గా చెక్ పెట్టాల‌ని వారు కోరుకుంటున్నారు. మ‌హిళా అంశం ఎన్నిక‌ల వేళ నెగెటివ్ గా మారే ప్ర‌మాదం ఉంద‌నేది వారి వాద‌న‌. అయితే, దీనిపై టీఆరెఎస్ పెద్ద‌లు మాత్రం స్పందించేలా క‌న‌ప‌డ‌టం లేదు. చూసిచూడ‌న‌ట్లుగానే వ‌దిలేస్తే మంచిద‌ని, స్పందిస్తే… అగ్నికి ఆజ్యంపోసిన‌ట్లే అవుతుంద‌ని టీఆర్ఎస్ కీ లీడ‌ర్ భ‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

మొత్తానికి జీవ‌న్ రెడ్డి అంశం…. ఇప్పుడు పోలిటిక‌ల్ స‌ర్కిళ్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*