బీజేపి ప్ర‌చార సార‌థిగా ప‌రిపూర్ణానంద‌

Read Time: 0 minutes

అనుకున్న‌ట్లుగానే… తెలంగాణ‌యోగి గా ప‌రిపూర్ణ‌నంద‌ను ప్ర‌క‌టించేందుకు బీజేపి అధిష్టానం రెడీ అయిపోయింది. తెలంగాణ‌లో ముఖ్యంగా గ్రేట‌ర్ జోన్ లో ప‌రిపూర్ణ‌నంద ప్ర‌చారం ద్వారా… ఎక్కువ సీట్లు గెలుచుకోవాల‌ని ఫిక్స్ అయింది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌న్న ఊహ‌గానాలు, బీజేపి సీఎం అబ్య‌ర్థి ఆయ‌నే అన్న ఊహ‌గానాలు చాలా ఉన్నా… అధికారికంగా ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

ఇప్ప‌టికే… హిందు ధ‌ర్మం పేరుతో స్వామి ప‌రిపూర్ణ‌నంద రాష్ట్రంలో కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ర్యాలీలు చేశారు. హిందుల‌పై ఓ ఒక్క వ్యతిరేక అంశం తెర‌పైకి వ‌చ్చినా… స్వామియే ముందున్నారు. పైగా ఓ మీడియా సంస్థ కూడా ఆయ‌న‌కు అండ‌గా ఉంది. దీంతో… ఆయ‌న్ను తెర‌ముందు ఉంచి, లాభ‌ప‌డాల‌ని బీజేపి చీఫ్ అమిత్ షా యోచిస్తున్నారు. అవ‌స‌ర‌మ‌యితే ఆయ‌న్ను సౌత్ ఇండియా మొత్తం వాడే ఆలోచ‌న కూడా ఉంది. ఆయ‌న‌కు సౌత్ ఇండియా వ్యాప్తంగా పేరుండ‌టంతో, బీజేపి చీఫ్ అమిత్ షా ఇప్ప‌టికే ప‌లుమార్లు భేటీ అయ్యారు. తాజాగా ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు వ‌రుస‌గా భేటీలు నిర్వ‌హిస్తున్నారు.

అయితే, స్వామి ప‌రిపూర్ణానంద‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ఉప‌యోగించుకొని, రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో… హైద‌రాబాద్ లోక్ స‌భ నుండి పోటీ చేయించాల‌ని ఆర్.ఎస్.ఎస్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని, కానీ ఆయ‌న బీజేపి త‌రుపున ప‌నిచేయ‌బోతున్నారు అంటున్నాయి బీజేపి స్టేట్ ఆఫీస్ వ‌ర్గాలు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*