బుల్లితెరపైకి బ్ర‌హ్మ‌నందం… ఇక మీ మాటీవీలో

Read Time: 0 minutes

వెండితెర‌పై ఓ వెలుగు వెలిగి, త‌న‌కంటూ… సినీ ప్ర‌పంచంలో కొన్ని పేజీలు లిఖించుకున్న స్టార్ క‌మెడీయ‌న్ ఇప్పుడు బుల్లితెర‌కు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. సినిమాలో హీరో ఎవ‌రు, హీరోయిన్ ఎవ‌రు అని అడ‌గ‌టం స‌హ‌జం కానీ, బ్ర‌హ్మ‌నందం ఉన్నాడా.. అని అడిగే వారంటే తను ఎంత కీల‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ప్లాప్ అవుతాయ‌నుకున్న సినిమాల‌ను కూడా ప్రేక్ష‌కుల‌కు చేర్చిన ఘ‌న‌త బ్ర‌హ్మ‌నందంది.

కానీ పాత నీరుపోయి కొత్త నీరు రావ‌టం స‌హ‌జం క‌దా…. ఓవైపు జ‌బ‌ర్ధ‌స్ టీవీ షో త‌ర్వాత టాలీవుడ్ లో కమెడియ‌న్స్ పెర‌గ‌టం, తాజా ట్రెండ్ కు బ్ర‌హ్మ‌నందం దూర‌మ‌వుతూ రావ‌టంతో… బ్ర‌హ్మ‌నందం ప్ర‌భ త‌గ్గిపోయింది. అందుకే, దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ది. అది కాస్త లేటుగా అర్థం చేసుకున్న బ్ర‌హ్మనందం… మ‌రో కమెడియ‌న్ అలీని ఫాలో అయిపోయాడు. కాక‌పోతే, త‌న కొత్త అవ‌తారం… ఇప్పుడు స్టార్ మా టీవీలో.

ది గ్రేట్ తెలుగు లాప్ట‌ర్ చాలేంజ్ కార్య‌క్ర‌మంతో… ప్ర‌తి వీకెండ్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి న‌వ్విస్తూ, న‌వ్వించే వారి ప‌ట్ట న్యాయ‌నిర్ణేత అవ‌తారం ఎత్తాడు. ఈ శ‌నివారం నుండే  రాత్రి 9గంట‌ల‌కు స్టార్ మా లో కొత్త‌గా ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు.

గ‌తం ఎంత ఘ‌న‌మైనా… వ‌ర్త‌మానాన్ని విస్మ‌రించ‌లేం. మ‌రీ.. స్టార్ క‌మెడియ‌న్, స్టార్ మాలో ఎంత‌వ‌ర‌కు క్లిక్ అవుతాడో, వారంతాల్లో మా రేటింగ్ ను ఎంత పెంచుతాడో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*