అలంపూర్ నుండి అదిలాబాద్ వ‌ర‌కు

Read Time: 0 minutes

అలంపూర్ నుండి కాంగ్రెస్ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్ట‌బోతోంది. పార్టీ సీనీయ‌ర్ నేత‌లు, బ‌డానేత‌లంతా ఒకే వేధికపై వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నారు. మ‌హ‌కూట‌మితో పొత్తు ఉన్నా… ఇంకా ఆల‌స్యం చేస్తే, ప్ర‌చారంలో వెన‌బ‌డి పోతామ‌న్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్ర‌చారానికి రెడీ అయ్యింది. మ‌హ‌కూట‌మితో ప్ర‌చారం చేస్తూనే, ఒంట‌రిగా కూడా రేప‌టి నుండి నేత‌లు ప్ర‌చార ప‌ర్వంలోకి దిగ‌బోతున్నారు. గురువారం జోగులాంబ ఆల‌యంలో… ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం, అక్క‌డి నుండే ప్రచారం చేయాల‌ని పీసీసీ డిసైడైంది.

న‌వంబ‌ర్ 24 న ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని, పీసీసీ నేత‌ల‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కాంగ్రెస్ రెడీ అయిపోయింది. ఒవైపు రాష్ట్రస్థాయి నేత‌ల‌తో ప్ర‌చారం చేయిస్తూనే, కాంగ్రెస్ పెద్ద‌నేత‌ల్ని ప్ర‌చారంలోకి దించ‌బోతుంది. కరీంన‌గ‌ర్, గ‌జ్వేల్, న‌ల్గొండ‌, అదిలాబాద్ ల‌లో సోనియా కనీసం మూడు స‌భ‌ల్లో పాల్గొన‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆమె స‌భ‌లు ఖ‌రారు చేసుకోమ‌ని స‌ల‌హా కూడా ఇచ్చార‌ట‌. ఇక గ్రేట‌ర్ లో ఒ స‌భ‌తో పాటు, ఖ‌మ్మం స‌హా సోనియా క‌వ‌ర్ చేయ‌ని మిగ‌తా జిల్లాల్లో క‌నీసం 10 చోట్ల స‌భ‌లు, ర్యాలీలు, పాద‌యాత్ర‌ల‌కు రాహుల్ హ‌జ‌రుకాబోతున్నారు. ఓ వైపు మ‌ద్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ ఘ‌డ్ ఎన్నిక‌ల‌ను చూసుకుంటూనే, తెలంగాణ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ధ్ద పెట్ట‌బోతున్నారు రాహుల్ అని డీల్లీ ఏఐసీసీ వ‌ర్గాలంటున్నాయి. దేశంలో కాంగ్రెస్ కు  సానుకూల‌త ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక‌టి కాబ‌ట్టి, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌లు బూస్ట్ లా ప‌నిచేస్తాయ‌ని రాహుల్ కొన్ని సంద‌ర్భాల్లో తెలంగాణ నేత‌ల‌తో ముచ్చ‌టించారు. పైగా మ‌ద్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ ఘ‌డ్, తెలంగాణ ద‌గ్గ‌రగా ఉన్న రాష్ట్రాలు కావ‌టంతో, ప్ర‌చారంతో పాటు ప్రచార స‌ర‌ళిని రాహుల్ ద‌గ్గ‌ర నుండి పర్య‌వేక్షించే అవ‌కాశం ఉంది.

ఇక ఇప్ప‌టికే ప్ర‌చారం కోసం 3 హెలికాప్ట‌ర్ల‌ను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ప్రచార క‌మిటీ ఆద్వ‌ర్యంలో మూడు ప్ర‌త్యేక బృందాలు రాష్ట్రం లోని అన్ని మూల‌ల క‌వ‌ర్ చేసేలా ప్లాన్ చేశారు. ఇక జిల్లాల వారిగా కూడా ప్ర‌త్యేక మ్యానిఫెస్టోలు రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*