ఆప‌ద్ద‌ర్మ‌మంత్రివైతే… రూల్స్ ప‌ట్ట‌వా… జ‌గ‌దీషా?

Read Time: 0 minutes

నిన్న‌టి దాకా నువ్వు ఎదైనా కావ‌చ్చు, రేపు ఇంకేదైనా కావ‌చ్చు… కానీ ప్ర‌జ‌ల్లో ఉన్న‌ప్పుడు కొంచ‌మైనా హోదా కు తగ‌ట్లు న‌డుచుకోవాలి. కానీ ఆప‌ద‌ర్మ మంత్రిగా ఉన్న జ‌గ‌దీష్ రెడ్డి మాత్రం, త‌న నైజాన్ని వీడ‌టం లేదు. నేను ఈ ప‌నిచేసిన‌, ఈ హ‌మీ ఇచ్చి నేర‌వేర్చిన అని చెప్పుకొని గెలవాలి గానీ, అవినీతితో ఇంకెంతకాలం కాలం వెల్ల‌దీస్త‌రోన‌ని ఊరు వాడ కోడై కూస్తుంది.

రాష్ట్రంలో ఓవైపు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. అలాంట‌ప్పుడు నలుగురికి చెప్పే పెద్ద‌యానే…. చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్న‌డు. నేరుగా… ఓట‌ర్లను ప్ర‌భావితం చేసే అంశాల‌ను ప‌క్కన‌పెట్టాల్సింది పోయి, సైకిళ్లు పంచుడు, పార్టీ గుర్తు, త‌న ఫోటో ఉన్న నోట్ పుస్త‌కాలు, గులాబీ పెన్నులు పంచుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం  షురూ చేసిండు. అయినా, గెలవాలి అనుకోవాలి కానీ ఎలాగైనా గెలిచితీరాలి అన్న అహంబావం ఎప్ప‌టికీ ప‌నికిరాద‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

మొద‌టినుండి దుందుడుకు గా సూర్యాపేట‌లో నెగ్గుకొస్తున్న జ‌గ‌దీష్ రెడ్డికి ఈసారి ఓట‌మి భ‌యం పట్టుకుంద‌ని, అందుకే నేరుగా ఓట‌ర్ల‌కు, వారి కుటుంబాల‌కు చేరేలా సైకిళ్లు పంపిణీలాంటి కార్య‌క్ర‌మాలు, డ‌బ్బు పంపీణీ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టార‌ని విమర్శిస్తున్నారు. సూర్యాపేట‌లో నెక్ టు నెక్ ఫైట్ ఉండ‌బోతుంది. ఓవైపు మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, మ‌రోవైపు మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి లు త‌ల‌ప‌డుతుండ‌టంతో… ఎం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ కొన‌సాగుతుండ‌గా, జ‌గ‌దీష్ రెడ్డి ఇలా దిగ‌జారి గెలుపుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని కాంగ్రెస్ శ్రేణులు విమ‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే… కలెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు.

d7a57c1c-edab-429c-9df5-890dae7c75b4

అయితే… సూర్యాపేట‌లో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. అక్క‌డ ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న కలెక్ట‌ర్, ఎస్పీ ఇద్ద‌రు స్థానికులే కావ‌టంతో… సొంత ఇంపార్టెన్స్ తో ప్ర‌భుత్వానికి స‌హాయ ప‌డే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంలో ఉండ‌గా ఏరీకోరీ తెచ్చుకున్న అధికారులు కావ‌టంతో, జ‌గ‌దీష్ రెడ్డికి అనుకూలంగా ప‌నిచేస్తార‌ని కొంద‌రు స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికైనా… ఎన్నిక‌ల సంఘం మేల్కొని సూర్యాపేట స‌హా న‌ల్గొండ ప‌రిస్థితుల‌పై కాస్త ఎక్కువ దృష్టి, నిఘా పెట్టాల‌ని కోరుతోంది కాంగ్రెస్ పార్టీ.

3d3edbb0-0389-469c-b350-6d8a193d6c98

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*