సెమీ ఫైన‌ల్ ఎన్నిక‌లు… చ‌త్తీస్ ఘ‌డ్ ముఖ‌చిత్రం

Read Time: 1 minutes

న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల్లో  చ‌త్తీస్ ఘ‌డ్ ఒక‌టి. ఉత్త‌ర చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలో అయితే… ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అధికారులే వెన‌కాముందు ఆడుతారు. అందుకే అక్క‌డ రాష్ట్రం మొత్తం కేవ‌లం 90 స్థానాలున్నా, రెండు ధ‌ఫాలుగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో కీల‌క‌మైన 18స్థానాల‌కు మొద‌టిద‌శ‌లో, మిగ‌తా స్థానాల‌కు రెండో ద‌శ‌లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

చ‌త్తీస్ ఘ‌ఢ్ రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ కృషిచేయ‌టంతో అక్క‌డ బీజేపీ హావా ఉంటుంది. ఆ పార్టీ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్ కు మంచి పేరుండ‌టంతో, అంతా తానే అయి పార్టీని, ప్ర‌బుత్వాన్ని ముందుండి, స‌మ‌న్వ‌యంతో న‌డిపిస్తున్నారు. వ‌రుస‌గా మూడు సార్లు ముఖ్య‌మంత్రి గా పూర్తికాలం ప‌నిచేసిన అనుభవం ఆయ‌న‌కుంది. 2003 డిసెంబ‌ర్ నుండి సీఎంగా ప‌నిచేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ముంగిట బోల్తాకొట్టింది. ఈసారి స‌ర్వేలు కూడా కాంగ్రెస్ కు అధికారం ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే, త‌న అభివృద్ది మంత్రంతోనే బీజేపీ ఎన్నిక‌ల‌కు వెళ్తోంది. న‌యా రాయ్ పూర్ నిర్మాణం పూర్తికావ‌టం స‌హా అభివృద్ది కార్య‌క్ర‌మాలు కొన‌సాగించాలంటే మ‌రోసారి త‌మ‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కి ప్ర‌బుత్వ వ్య‌తిరేక‌త ఓటు బ్యాంకు క‌లిసొచ్చే అంశంగా ఉండ‌గా, గిరిజ‌నులు-మావో ప్ర‌భావిత ప్రాంతాల్లో బీజేపీ వ్య‌తిరేక‌త ఓటు ఎటు ఉంటే ఆ పార్టీకి స్ప‌ష్టంగా విజ‌యావ‌కాశాలు ఉండునున్నాయి. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా చేసిన అజిత్ జోగి సొంతకుంప‌టితో… కొన్ని సీట్ల‌లో విజ‌య‌వ‌కాశాల‌కు గండిప‌డే అవ‌కాశం ఉంది.

అయితే, ఓవ‌రాల్ గా చూస్తే… బీజేపీ-కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న‌ట్లు ఎన్నిక‌లు ఉండ‌బోతున్నాయి. ఎవ‌రు గెలిచిన భారీ తేడా అయితే ఉండే అవ‌కాశం లేదు. కానీ స‌ర్వేలు మాత్రం ప్ర‌స్తుతానికి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*