చొప్ప‌దండి సీటుపై ఇంకా స‌స్పెన్స్, తాజామాజీకి బిజేపి బంప‌రాఫ‌ర్

Read Time: 0 minutes

సీఎం కేసీఆర్ డైరెక్టుగా… సీటు ఇచ్చుడు కుదుర‌దు అని చెప్ప‌క‌నే చెప్పినా, చొప్ప‌దండి తాజామాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ‌కు మాత్రం ఆశ‌లు చావ‌టం లేదు. 18ఏండ్లుగా పార్టీల ప‌నిచేసినా, మ‌ళ్లీ నాకే ఇస్తారు సీటు అంటూ… త‌న‌కు తానే స‌ర్ధిచెప్పుకుంటుంది. ఇప్ప‌టికే కేసీఆర్ ను రెండు సార్లు కేసీఆర్ ను కలిసే ప్ర‌య‌త్నం చేసినా, ఆయ‌న చూసి చూడ‌న‌ట్లు వెళ్లిపోయారు. అయినా… తాను వెన‌క్కి త‌గ్గేది లేదంటూ, ఇంకా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉంది. కేటీఆర్ తో ఇప్ప‌టికే త‌న సీటు విష‌యమై మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

అయితే, తాజామాజీకి బీజేపి బంప‌ర్ ఆఫర్ ఇస్తోంది.  త‌ను ఏ క్ష‌ణంలో స‌రే అంటుదా…  ఫ్లైట్ ఎక్కించి, అమిత్ షా ఆద్వ‌ర్యంలో కండువా క‌ప్పేయాల‌న్న ఆలోచ‌న‌తో ల‌క్ష్మ‌ణ్ టీం వెయిట్ చేస్తోంది. శోభ కూడా టీఆర్ఎస్ టికెట్ ద‌క్క‌క‌పోతే క‌దా… చూద్ధాం  అంటూ ఇంకా నాన్చుతూనే ఉంది. కానీ కొట్టి పారేయ‌టం లేదు. బీజేపీ నుండి కూడా పెద్ద ఆఫ‌రే ఉంద‌ట‌. ఎన్నిక‌ల ఖ‌ర్చు పూర్తిగా భ‌రిస్తామ‌ని… త‌మ పార్టీ గుర్తుమీద పోటీచేస్తే చాల‌ని, బీజేపీ బంప‌రాఫ‌ర్ ఇచ్చింద‌ని బీజేపీ వ‌ర్గాలంటున్నాయి.

కానీ, కేసీఆరో… కేటీఆరో ఓ మాట అనంది వెళ్తే ఏంలాభం, ఇక్క‌డ కూడా ఇంకా డైరెక్ట్ గా నో చెప్ప‌లేదు క‌దా అన్న‌ది శోభ వ‌ర్గీయుల సందేహాంగా క‌న‌ప‌డుతోంది. కేసీఆర్ టీం కూడా ఇప్ప‌టికే ఇత‌ర పార్టీల్లో కీల‌కంగా ఉన్న నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్లినా… టీఆర్ఎస్ టికెట్ పై చొప్ప‌దండి నుండి పోటీచేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌టం లేద‌ని తెలుస్తోంది. సుద్దాల దేవ‌య్య లాంటి సీనీయ‌ర్ నేత‌లు కూడా వెన‌క‌డుగు వేస్తున్నారంటే… టీఆర్ఎస్ పై ఆ సెగ్మెంట్ లో కాస్త ఆస‌మ్మ‌తి ఎక్క‌వ‌గానే ఉందన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కానీ స్థానిక నేత‌లెవ‌రూ శోభ‌కు టికెట్ కేటాయించే విష‌యంలో పెద్ద‌గా సంతృప్తి వ్య‌క్త‌ప‌ర్చ‌టం లేద‌ట‌. త‌న నోటీ దురుసు మ‌ళ్లీ భ‌రించాలా అని సీనీయ‌ర్ నేత‌ల‌కు మొఖం మీదే ప్ర‌శ్న‌లు ఎదుర‌వ‌తున్నాయ‌ని స్థానిక నేత‌లంటున్నారు.

కానీ, పార్టీ ఏదైనా… తాను మాత్రం పోటీలో ఉంటామంటోంది శోబక్క‌,గాల‌న్నల జంట‌. మ‌రీ కేసీఆర్… ద‌య త‌లుస్తాడా, బీజేపీ ప్లైట్ టైం అయిపోతుందా…. చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*