కాంగ్రెస్ కు ట‌చ్ లో సీనీయ‌ర్ అఫిషీయ‌ల్స్, టెన్ష‌న్ లో కేసీఆర్

Read Time: 0 minutes

నీటి ప్ర‌వాహాం వంపుగా ఉన్న వైపు ఎలా ప‌రుగెడుతుందో… అధికారులైనా, నేత‌లైనా… ప్ర‌బుత్వంలోకి వ‌చ్చే పార్టీ నేత‌ల‌వైపు ప‌రుగులు పెడుతారు. అది స‌హాజం. తెలంగాణ‌లో తామే 110సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తామ‌ని ఓవైపు కేసీఆర్ గంటాప‌థంగా చెబుతున్నా… ఆ ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. అందుకే తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన సీనీయ‌ర్ అధికారులంతా… కాంగ్రెస్ కు ట‌చ్ లో ఉన్నారు. కీల‌క‌మైన కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ క్యాంపెయినింగ్ క‌మిటీ చైర్మ‌న్ బ‌ట్టివిక్ర‌మార్క‌తో 23మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు క‌లిసారు. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మీనా ఆధ్వర్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ నాయకులను కలుసుకోవడం సంచలన సన్నివేశం. ఐపీఎస్ సీనియర్ అధికారి కృష్ణ ప్రసాద్, ఐఏఎస్ శివకుమార్,ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు కాంగ్రెస్ నాయకులతో నిరంతరం ‘టచ్’ లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

గ‌తంలో… రాజ‌కీయ నాయ‌కుల తీరుతో ఐఎఎస్ అధికారులు విసిగుచెందారు. జ‌య‌శంర్ భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేసిన ముర‌ళి విష‌యంలో అప్ప‌టి స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. ఓ సామాజిక వ‌ర్గం అధికారుల‌పై క‌త్తిగ‌ట్టార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కేవలం ఒక‌టి రెండు సామాజిక‌వ‌ర్గాల‌కే ప్రాధాన్య‌త ద‌క్కుతుంద‌ని సీనీయ‌ర్ అధికారులు గ‌గ్గోలు పెడుతున్నారు. పైగా… సీనీయ‌ర్,జూనియ‌ర్ అన్న‌తేడా లేకుండా.. ఓ వ‌ర్గం త‌మ‌పై పెత్త‌నం చేయ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.  దీంతో ఈ భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

అయితే, ఈ భేటీలో భ‌విష్య‌త్ ప‌రిణామాల‌పైపే చ‌ర్చ జ‌రిగిందా… లేక గ‌త ప్ర‌భుత్వంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కూడా ఏమైనా చ‌ర్చ‌లు జ‌రిగాయా అన్న‌ది బ‌య‌ట‌కు రావ‌టం లేదు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*