గ‌ద్వాల జేజ‌మ్మ‌పై అంతెత్తున లేచిన కేసీఆర్

Read Time: 0 minutes

కేసీఆర్ కు అవ‌త‌లివారిని తిట్టుడే తెలుసు. కానీ కేసీఆర్ ను ఎవరైనా తిడుతే… అందులోనూ కేసీఆర్ కు ప‌ర్స‌న‌ల్ గా త‌గిలేలా తిడితే…. ఎలా ఉంట‌ది.  ఈ ప్ర‌శ్న‌లు వ‌చ్చేవారు వ‌న‌ప‌ర్తి మీటింగ్ లో కేసీఆర్ స్పీచ్ వినాల్సిందే. కొద్దిరోజులుగా ప్ర‌తిపక్షాల‌ను నోటికి ఎంతొస్తే అంత అంటూ, తీవ్రంగా విమ‌ర్శిస్తున్న కేసీఆర్ కు, కాంగ్రెస్ ప్ర‌చార ప్రారంభ స‌భ‌లో గ‌ద్వాల జేజ‌మ్మ‌గా పిలుచుకునే డీకే.అరుణ ఇచ్చిన వార్నింగ్ గ‌ట్టిగానే త‌గిలిన‌ట్లుంది.

ప్ర‌చారం ప్రారంబ స‌భ‌లో మాట్లాడుతూ… డీకే అరుణ‌, చూసుకుందాం రండి రా… నా కొడుక‌ల్లారా అంటూ ఫైర్ అయింది. దాంతో వ‌న‌ప‌ర్తి స‌భ‌లో కేసీఆర్ డీకే.అరుణ‌పై ఓరేంజ్ లో ఫైర్ అయ్యారు. డీకే అరుణ‌… నీ సంగ‌తి తేలుస్తాం, నీ బండారం బ‌య‌ట‌పెడుతా, ప్ర‌తి ఇంటింటికీ వెళ్లి నీ చ‌రిత్ర వివ‌రిస్తాం అంటూ ఓ అంతెత్తున లేచారు. దీంతో కేసీఆర్ మాట‌లు వింటూ, అక్కడున్న వారు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో శ‌ని డీకే.అరుణ అని, కాంగ్రెస్ నేత‌లు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకునేది లేదూ, జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు. క‌త్తులు తిప్ప‌టం కాదు, క‌త్తులు తిప్పాల్సిన కాడా తిప్ప‌కుండా… చౌర‌స్తాలో న‌లుగురి మ‌ద్య తిప్ప‌టం ఏం లాభం అంటూ కేసీఆర్ సెటైర్స్ వేశారు. డీకే అరుణ అవినీతి, చ‌రిత్ర బాగోతాల‌న్నీ త్వ‌ర‌లోనే ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడుతామ‌ని హెచ్చ‌రించారు కేసీఆర్.  పాల‌మూరు జిల్లాకు నీరివ్వ‌కుండా, రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లిస్తుంటే… హ‌రతీప‌ట్టి మ‌రీ నీళ్ల దోపిడికి స‌హ‌క‌రించిన శ‌ని డీకే అరుణ అంటూ కేసీఆర్ విమ‌ర్శించారు. మొత్తం వ‌న‌ప‌ర్తి మీటింగ్ అంతా… డీకే అరుణ‌, చంద్ర‌బాబు కేంద్రంగా సాగ‌టం కొస‌మెరుపు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*