కేసీఆర్ కు టెన్ష‌న్ పుట్టిస్తున్న గ‌జ్వేల్ టీఆర్ఎస్ గ్రూపులు

Read Time: 0 minutes

రాష్ట్రంలో ప‌రిస్థితి దేవుడెరుగు, కేసీఆర్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ లో త‌ల‌నొప్పులు టెన్ష‌న్ పెట్టిస్తున్నాయి. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌టంతో… అభివృద్దిలో కొంత‌మేరుగ్గానే ఉన్నా, చేసిన ప‌ని చెప్పుకోవ‌డానికి కూడా కేసీఆర్ కు స‌రైన టీం లేకుండా పోయింది. గ‌జ్వేల్ లో కేసీఆర్ నేరుగా ఏ విష‌యాన్ని ప‌ట్టించుకోడు. గ‌జ్వేల్ నుండి ముగ్గురికి చైర్మ‌న్లు ఇచ్చినా, అందులో ఇద్ద‌రు పెద్ద‌గా ప్ర‌భావం చూపే నాయ‌కులు కారు.

ఇక మూడో వ్య‌క్తి, గ‌జ్వేల్  మాజీ ఎమ్మెల్యే తూంకుంట న‌ర్సారెడ్డి కేసీఆర్ కు అండ‌గా ఉన్నా, కొంతకాలంగా… స్థానికంగా పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు. త‌న‌ను పట్టించుకోవ‌టం లేద‌ని ఆయ‌న అంటీముట్ట‌న్న‌ట్లుగా ఉన్నారు. అధికారుల చెప్పిన‌ట్లు వింటూ… పార్టీని అయోమ‌యానికి గురిచేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డుతున్నారు.

గ‌తంలో గ‌జ్వేల్ ఎన్నిక‌లంటే… న‌ర్సారెడ్డి, ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత ప్ర‌తాప్ రెడ్డి మ‌ద్య హోరాహోరీ పోరు ఉండేది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లో న‌ర్సారెడ్డికి ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆయ‌న కొంత స్త‌బ్ధుగా ఉన్నారు. ప్ర‌తాప్ రెడ్డి ఎదురేలేద‌న్న‌ట్లు దూసుక‌పోతున్నారు. దీంతో గ‌జ్వేల్ లో టీఆరెఎస్ శ్రేణులు ఆయోమ‌యంలో ప‌డ్డాయి. ఎవ‌రిని క‌ల‌వాలి, ఎవ‌రికీ చెప్పుకోవాలి, ప్ర‌చారం ఎవ‌రు నిర్వ‌హిస్తారు… ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, ప్రతాప్ రెడ్డి మాత్రం… ఒక్కో స్థానిక లీడ‌ర్ ను పార్టీలోకి చేర్చుకుంటూ, టీఆర్ఎస్ కు ద‌డ పుట్టిస్తున్నారు.

ఎంతో కొంత ప‌ట్టించుకునే హ‌రీష్ కూడా గ‌జ్వేల్ తో అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం, గ్రౌండ్ లో ఎం జ‌రుగుతుందో అన్ని విష‌యాలు కేసీఆర్ వ‌ద్ద‌కు చేర‌క‌పోవ‌టంతో… గ‌జ్వేల్ లో టీఆర్ఎస్ కు షాక్ త‌గిలిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*