గ‌జ్వేల్ బ‌రిలో గ‌ద్ద‌ర్, కాంగ్రెస్ లో చేరిక‌

Read Time: 0 minutes

ప్ర‌జా యుద్ద‌నౌక‌, మాజీ న‌క్స‌లైట్ గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్ప‌టికే ఆయ‌న కొడుకు సూర్య కిర‌ణ్ కాంగ్రెస్ లో ఉండ‌గా, తాను కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మాజీ ఎంపీ మ‌దుయాష్కీ ఆద్వ‌ర్యంలో ఆయ‌న రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.

అంత‌కు ముందే రాష్ట్ర పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌, గ‌జ్వేల్ నుండి కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. పైగా గ‌జ్వేల్ నుండి ఆయ‌న స్థానికుడు కూడా. యావ‌త్ తెలంగాణ రాష్ట్రంలో గ‌ద్ద‌ర్ చేరిక త‌మ‌కు లాభిస్తుంద‌ని ఆపార్టీ అంచ‌నా వేస్తోంది. పైగా గ‌జ్వేల్ నుండి గ‌ద్ద‌ర్ పోటీ చేస్తే, మ‌హ‌కూట‌మి యే కాకుండా.. సీపిఎం కూట‌మి అయిన బీ.ఎల్.ఎఫ్ కూడా పోటీలో ఉండే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే  గ‌ద్ద‌ర్ వారితో కూడా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న ఒంటెరు ప్ర‌తాప్ రెడ్డి ప‌రిస్థితి ఎంట‌న్న‌ది కీల‌కంగా మారింది.

ఆయ‌న‌కు ఎమ్మెల్సీ లేదా వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీ ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆయ‌న దానిపై పూర్తిసంతృప్తిగా లేడు. దీంతో, పీసీసీ ముఖ్య‌నేత‌లు న‌చ్చ‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌వేళ గ‌ద్ద‌ర్ గ‌జ్వేల్ బ‌రిలో ఉండేందుకు ఆస‌క్తి చూప‌క‌పోతే మాత్రం… వ‌చ్చె లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి లోక్ స‌భ స్థానం నుండి పోటీచేయించాల‌న్న ఆలోచ‌న‌తో ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

ఒక‌వేళ గ‌ద్ద‌ర్ కాక‌పోతే ఆయ‌న కొడుకు సూర్య‌కిర‌ణ్ కు అవ‌కాశం ఇచ్చేఅవ‌కాశం ఉంది. కానీ ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లోనే మ‌ల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం పై ఆశ‌లు పెట్టుకున్నారు. త‌న‌కు అవ‌కాశం ఇస్తామ‌న్న హ‌మీతోనే ఆయ‌న గ‌తంలో పార్టీ చేరారు. ఇప్ప‌టికే మ‌ల్కాజ్ గిరిలో ఆయ‌న త‌న అనుచ‌ర‌గ‌ణాన్ని కూడ‌గ‌ట్టుకోవ‌టం, ప్ర‌చారానికి రెడీ అయిపోయారు.

అయితే గద్ద‌ర్, ఆయ‌న కొడుకులో ఎవ‌రికో ఒక‌రికే పోటీకి అవ‌కాశం క‌ల్పించ‌బోతుంది కాంగ్రెస్ పార్టీ.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*