
సీఎంగా ఉన్న నియోజకవర్గంలో, అవతలి పార్టీ నుండి పోటికీ అభ్యర్థులే కరువైన పరిస్థితులు ఉండేవి. నాడు వైఎస్, చంద్రబాబు ఇలా ఎవరినీ తీసుకున్న వారికి సొంత నియోజకవర్గం అంటే కేక్ వాక్ అయ్యేది. కానీ కేసీఆర్ పరిస్థితి డిఫరెంట్ గా తయారైంది. కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లోనే అయిన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఒంటెరు ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ అయిపోయారు. 2014 ఎన్నికల్లో చివరి వరకు ఆయన పోటీ ఇచ్చినా… ఈసారి ఖచ్చితంగా ఒడించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అక్కడ 2009-2014వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు ఉత్తమ్ తో చర్చలు నడిపారు. వీరిద్దరు కాంగ్రెస్ నుండి కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ పనిచేస్తే… కేసీఆర్ ను ఓడించటం నల్లేరుపై నడకే అన్నది గజ్వేల్ లో చర్చనీయాంశం అయింది. ఏ ఇద్దరు కలిసిన ఇదే విషయం చర్చకు వస్తుందంటే, అక్కడ కేసీఆర్ పై వ్యతిరేకత లేకుండా లేదు అన్నది తెలిసిపోతుంది.
అయితే, కాంగ్రెస్ లో చేరికపై నర్సారెడ్డి నేరుగా ఇప్పటివరకు స్పందించలేదు. ఆయన పార్టీ వీడుతున్నారని తెలియగానే… టీఆర్ఎస్ లో కలకలం రేగింది. దీంతో కేసీఆర్ సన్నిహిత నేతలను నర్సారెడ్డి వద్దకు రాయాభారానికి పంపారని, ఆయన అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ నర్సారెడ్డి — ప్రతాప్ రెడ్డి ద్వయం కేసీఆర్ కు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే మాత్రం… కేసీఆర్ కు ఓటమి తప్పదంటున్నారు స్థానిక టీఆర్ఎస్ నేతలు.
Leave a Reply